వచ్చే ఏడాది ఒక్కో నెల ఒక్కొక్క మెగా హీరోల సినిమాలు విడుదల అవుతూ మెగా అభిమానులను ఎంతగానో అలరించబోతున్నారు. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనవరి 7వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత నెలలోనే ఏకంగా ముగ్గురు మెగా హీరోల సినిమాలు విడుదల అవుతుండటం విశేషం.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఆచార్య చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదల అవుతుండగా ఆ సినిమా విడుదలైన 15 రోజుల వ్యవధిలోనే తేజ్ హీరోగా నటించిన గని చిత్రం కూడా విడుదలవుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 18వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటన చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 24 వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. 

ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మూడో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మా చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సరికొత్త సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మెగా స్టార్ నటిస్తున్న మరొక సినిమా గాడ్ఫాదర్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. పవన్ హరి హరి వీరమల్లు చిత్రం కూడా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: