సీనియర్ హీరోలకి కథలు ఈజీగానే దొరుకుతున్నాయి గానీ, హీరోయిన్లు దొరకడం లేదు. ఒకప్పుడు సీనియర్‌ స్టార్స్‌కి ఫస్ట్ ఆప్షన్‌గా కనిపించిన అనుష్క, నయనతార లాంటి వాళ్లు సినిమాలు చేయడం లేదు. నయనతార భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినా, కోలీవుడ్‌ని విడిచిపెట్టి తెలుగు ఇండస్ట్రీకి రావడం లేదు. తమిళ్, మళయాళీ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది.  అనుష్క 'సైజ్‌జీరో' టైమ్‌ నుంచి బరువు తగ్గాలని ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ట్రై చేసినా, ఫారెన్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్నా, స్వీటీ మాత్రం మునుపటి లుక్‌ తెచ్చుకోలేకపోతోంది. పైగా 'నిశ్శబ్ధం' టైమ్‌లో ఫేస్‌లో చార్మింగ్‌ లేదని, హీరోయిన్‌ లుక్‌ పోయిందనే కామెంట్లు వచ్చాయి. దీంతో సీనియర్ హీరోలు కూడా అనుష్కని పక్కనపెడుతున్నారు. కాజల్‌ అగర్వాల్ థర్టీ ఫైవ్‌ క్రాస్ చేశాక, యంగ్‌స్టర్స్ నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. చిరు అయితే కాజల్‌కి రెండు సినిమాలు ఇచ్చాడు. 'ఖైదీ నం.150'తో పాటు 'ఆచార్య'లోనూ మెగాస్టార్‌తో జోడీ కట్టింది కాజల్. అలాగే నాగార్జునతో 'ది ఘోస్ట్' సినిమాలకి సైన్ చేసింది. అయితే త్వరలోనే అమ్మకాబోతోన్న కాజల్‌ కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉండాలనుకుంటోంది.

సొనాల్ చౌహాన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఈ హీరోయిన్‌కి సరైన స్టార్డమ్‌ లేదు. బాలక్రిష్ణతో చేసిన 'డిక్టేటర్, రూలర్' తర్వాత సొనాల్‌ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సొనాల్‌ ఫేడవుట్‌ అవుతుందనే కామెంట్స్‌ వచ్చాయి. ఇలాంటి సమయంలోనే  నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ అందుకుంది. కాజల్‌ తప్పుకోవడంతో సోనాల్‌ని తీసుకున్నాడు నాగార్జున. అలాగే 'ఎఫ్3'లో కూడా ఒక హీరోయిన్‌గా చేస్తోంది సోనాల్.

తమన్నా మిల్కీగ్లామర్‌తో హడావిడి చేస్తోంది గానీ, అవకాశాలు మాత్రం పెద్దగా రావడంలేదు. థర్టీ ప్లస్‌లో ఉందని మిల్కీని యంగ్‌స్టర్స్ పెద్దగా ప్రిఫర్ చేయడం లేదు. దీంతో తమన్నా కొంచెం స్లో అయింది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోలు ఏంజెల్‌ గాడ్స్‌లా ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి 'భోళాశంకర్' సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. శ్రుతీ హాసన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసినప్పుడు మళ్లీ ఈమె బిజీ అవుతుందా అని చాలామంది సందేహించారు. కానీ శృతి మాత్రం అందరి అనుమానాలు తీరుస్తూ, పాన్‌ ఇండియన్ మూవీతో పాటు, సీనియర్ల సినిమాలతో బిజీగా ఉంది. రవితేజ 'క్రాక్'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్‌ చేసిన శ్రుతి నెక్ట్స్‌ బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని సినిమాలో సందడి చేయబోతోంది. అలాగే ప్రభాస్‌తో 'సలార్'లో స్టెప్పులేస్తోంది శ్రుతి.


మరింత సమాచారం తెలుసుకోండి: