సినిమా ఇండస్ట్రీలో కి ఎంత మంది యంగ్ హీరోలు ప్రతి సంవత్సరం విజయాలను అందుకుంటూ ఉంటారు, అలా ఈ సంవత్సరం కూడా కొంత మంది కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నారు, ఆ హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటో మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు సన దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు, మొదటి సినిమాలోనే తన నటనతో ఎంతో మంది  ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ యంగ్ హీరో మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు,  అలాగే మొదటి సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్ లను సాధించిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమా విషయంలో కృతి శెట్టి అందచందాలు, నటన ప్రధాన పాత్రను పోషించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్రను పోషించింది.

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ 'పేపర్ బాయ్' సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో, ఏక్ మినీ కథ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమా థియేటర్ లలో కాకుండా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది, ఈ సినిమాతో సంతోష్ శోభన్ ఇటు  ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందాడు,

తేజ సజ్జ  చిన్న తనం నుండి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు జాంబీ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు, జాంబీస్ కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొంది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: