ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అనుకున్న విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ లు తాము ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీకి విడుదల అవుతాయా లేకుంటే మళ్ళీ వాయిదా పడతాయా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నవేళ చెన్నైలో జరిగిన ఫంక్షన్ లో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7న విడుదల అవుతుంది అని ప్రకటించడంతో ఈ కన్ఫ్యూజన్ కు తెరపడింది.





బాలీవుడ్ ఇండస్ట్రీకి గుండె లాంటి మహారాష్ట్రాలో కూడ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతోంది. అనేక రాష్ట్రాలలో ధియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నారు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో పాన్ ఇండియా మూవీలు అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ లు విడుదల అయినా కలక్షన్స్ సంతృప్తి కరంగా వస్తాయా అన్నసందేహాలు చాలామందికి ఉన్నాయి.




దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టిక్కెట్ల పంచాయితీ ధియేటర్ల పై దాడులు ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాధే శ్యామ్’ సినిమాలను ఒకవైపు ధియేటర్లలో విడుదల చేస్తూ మరొకవైపు ఓటీటీ లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఇప్పుడు రాజమౌళి కాంపౌండ్ లో కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఆలోచన రాజమౌళికి ఏమాత్రం నచ్చలేదు అని అంటున్నారు.




దీనికి కారణం గతంలో సల్మాన్ ఖాన్ ‘రాథే’ విషయంలో కూడ అప్పటి కరోనా పరిస్థితులను పరిగణంలోకి తీసుకుని ఇలాంటి పే పర్ వ్యూ ప్రయోగం చేసాడు. అయితే ఆ ప్రయోగం ఘోరంగా ఫెయిల్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా సల్మాన్ ఖాన్ కు కోట్లాదిమంది అభిమానులు ఉండటంతో వారంతా సల్మాన్ ఖాన్ సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలని ఒకేసారి ప్రయత్నించడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక ఓటీటీ సర్వర్ క్రాష్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: