టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ఎఫ్2 కి సీక్వెల్ ఎఫ్ 3 ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు అనిల్. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు ఎండింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఈ సినిమా విడుదల కాకముందే అనిల్ రావిపూడి చేసే తదుపరి సినిమాపై అందరి లో అంచనాలు ఉన్నాయి. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఎవరితో చేసాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన బాలకృష్ణ తో సినిమా చేయాలని భావించి కథ కూడా రెడీ చేసి ఆయనకు వినిపించారట. గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమా తో బిజీగా ఉండడంతో కొన్ని నెలలు అనిల్ రావిపూడి ఖాళీగా ఉండక తప్పడం లేదు.

అయితే ఈ గ్యాప్ లో ఆయన మరో సినిమా చేయాలని భావిస్తుండగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఆయన సినిమా చేసే విధంగా మంతనాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఓ కథను తయారు చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడనీ. త్వరలోనే ఆయన ఇమేజ్ కు బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథను తయారు చేసి రౌడీ స్టార్ కు వినిపించనున్నాడని అన్నారు. అయితే విజయ్ త్వరలోనే సుకుమార్ సినిమాను చేయనున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి తో ఎంతవరకు సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఈ నేపథ్యంలో అనిల్ మరొక హీరోను వెతుక్కొకతప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: