సినీ పరిశ్రమ పునాది అనేది చిన్న సినిమాల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏడాదికి వంద సినిమాలు విడుదలైతే అందులో చిన్న సినిమాల వాటా సుమారు 90 శాతం ఉంటుంది. దాన్ని బట్టి ఇండస్ట్రీపై చిన్న సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా ఈ సంవత్సరం కూడా కొన్ని చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకున్నాయి. అవేంటో ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం..

ఉప్పెన

అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా ఈ సినిమాతోనే దర్శకునిగా అరంగేట్రం చేశాడు. ఒక మంచి ప్రేమకథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మైత్రి భారీ లాభాలను కూడా ఆర్జించింది.

జాతి రత్నాలు

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కి ఏకంగా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం అందుకుంది..

SR కల్యాణ మండపం

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మరో చిన్న సినిమా 'ఎస్ ఆర్ కళ్యాణమండపం'. కోవిడ్ సమయంలోఈ సినిమాకి మంచి ఓటీటీ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం థియేటర్లో విడుదల చేయగా.. సినిమాకి మంచి విజయం దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాతో కిరణ్ అబ్బవరంకి హీరోగా డిమాండ్ కూడా పెరిగింది..

పెళ్లి సందD

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రమిది. సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడం.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. పైగా విడుదలకు ముందే ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్టయ్యాయి. దీంతో యువతరం ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించి మంచి వసూళ్లను అందుకుంది..

రాజ రాజ చోర

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ 'రాజ రాజ చోర'. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా భారీ సక్సెస్ను  అందుకుంది ఈ సినిమా. ముఖ్యంగా సినిమాలో కామెడీ ట్రాక్, శ్రీ విష్ణు పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి..

ఇక ఇదే ఏడాది థియేటర్స్ లో కాకుండా ఓటీటీల్లో కూడా కొన్ని చిన్న సినిమాలు విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్నాయి  వాటిలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాకి మంచి ఆదరణ దక్కింది.  యు.వి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకి మంచి లాభాలు వచ్చాయి. ఇక అదే ఓటీటీ లో విడుదలైన మరో చిన్న సినిమా 'సినిమా బండి'. అతి తక్కువ బడ్జెట్ తో పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలా ఓటీటీ ల వల్ల కూడా చాలా వరకు చిన్న సినిమాలు గట్టెక్కాయి. ఇక ఈ చిన్న సినిమాలు చిత్ర పరిశ్రమకు ఎంతో భరోసాని అందించాయనే చెప్పాలి. మరి రాబోయే కొత్త ఏడాదిలో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగాలని కోరుకుందాం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: