టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ క్రమంలోనే ఇటీవల డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అదిరిపోయే నటనతో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చి సూపర్ హిట్ సాధించగా ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వచ్చిన పుష్ప సినిమా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా భారీగా వసూళ్లు రాబడుతు దూసుకుపోతుంది.


 సుకుమార్, అల్లు అర్జున్ తమ హిట్ కాంబినేషన్ కు తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు కూడా ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవల చిత్రబృందం థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ తన లైఫ్ జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని చెప్పుకొచ్చారు.. తాను ఈ స్థాయికి ఎదగడానికి దర్శకుడు సుకుమార్ కారణం అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.



 పుష్ప థాంక్యూ మీట్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు ఆర్య సినిమా వచ్చి ఉండకపోతే  నేను ఇంత పెద్ద హీరో అయ్యే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అయితే పరుగు సినిమా చేసిన సమయంలో 85 లక్షలు పెట్టి ఒక స్పోర్ట్స్ కార్ కొన్నాను. ఇక ఆ కార్ స్టీరింగ్ మీద చెయ్యి పెట్టి నేను ఇంత దూరం రావడానికి ఎవరు కారణం అంటూ ఆలోచిస్తే నా మైండ్ లో తట్టిన పేరు సుకుమార్. ఆయన లేకపోతే ఆర్య సినిమా నాకు వచ్చేది కాదు ఆ తర్వాత తన కెరీర్ కు మలుపు తిరిగేది  కాదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. స్టేజ్ కింద కూర్చున్న దర్శకుడు సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: