2021లో తెలుగు చిత్ర పరిశ్రమ మన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానితో తెలుగు చిత్రపరిశ్రమలో అనేకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ టాలీవుడ్ ఏ మాత్రం భయపడకుండా కాస్త ధైర్యం చేసింది అని చెప్పుకోవాలి. అయితే ఇదే తరుణంలో కొంతమంది కొత్త హీరో హీరోయిన్లు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు.

ఉప్పెన...

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తను హీరోగా చేసిన మొదటి సినిమా ఓపెన్ ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.100 కోట్ల బిజినెస్ చేయడంతో అతని మార్కెట్ కూడా పెరిగిపోయింది. అయితే ఈ సినిమా దాదాపు యాభై కోట్ల షేర్ ను అందించింది. ఇక ఈ 2021లో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు టాప్ హీరో గా ఉన్నాడు.

శ్రీకాంత్ కొడుకు....

సీనియర్ హీరో కొడుకు హీరోగా చేసిన మొదటి సినిమా పెళ్లి సందడి ఈ సినిమా విజయాన్ని అందుకుంటున్న లేదా అనే అనుమానం చాలామందిలో నే చెలరేగింది. అయితే ఈ సినిమాకు కీరవాణి గారు సంగీతాన్ని అందించి మంచి ప్లస్ అయ్యేలాగా చేశారు. ఈ సినిమా పండుగ సమయంలో వచ్చే మంచి క్రేజ్ మరియు మంచి కలెక్షన్లతో దూసుకెల్లింది. ఇక ఈ సినిమాకు కే రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే.

యాంకర్ ప్రదీప్....

ఒకప్పుడు సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఇక యాంకర్ గా అతని పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఎ షో చేసినా కూడా దానికి రేటింగ్స్ మాత్రం మామూలుగా ఉండవు. యాంకర్ గానే కాకుండా  30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనితో తను హీరో అవ్వాలి అనే కలను నిజం చేసుకున్నాడు. ఈ సినిమా  తనకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.

జాంబీ రెడ్డితో తేజ సజ్జా..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్ర సినిమాలో మనందరికీ కనిపించిన తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాటి తర్వాత హీరోగా తను చాలా ప్రయత్నాలు చేసాడు. దాని తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతనికి జాంబీ రెడ్డి అనే సినిమా  చేసాడు  తేజ సజ్జ. మంచి కలెక్షన్ లు అందుకున్న ఈ సినిమాతో హీరోగా నిలిచిపోయాడు.

సత్య.. వివాహా బోజనంబు

కమెడియన్ సత్య అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమలోనే ఉన్నాడు. అయితే సత్యం ఎప్పటికీ కమెడియన్ ఇలాగే ఉండి పోవాలి అని అనుకున్నాడట. దాని తర్వాత అతని టాలెంట్ ను చూసి తన టాలెంట్కి తగ్గ అవకాశం దక్కింది. అయితే వివాహ భోజనంబు అనే సినిమాలో హీరోగా నటించాడు సత్య. అయితే ఈ సినిమాలో కూడా బాగా ఇష్టపడ్డారు ప్రేక్షకులు. దీనితో మరింత గుర్తింపు అందుకున్నాడు సత్య.

మరింత సమాచారం తెలుసుకోండి: