2021 టాలీవుడ్ లో చాలా అరుదైన హిట్ సినిమాలను చూశాం.క్రాక్, వకీల్ సాబ్, అఖండ (Akhanda), ఉప్పెన, జాతిరత్నాలు, పుష్ప వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లను కూడా తెచ్చిపెట్టాయి. సినిమాలు లవ్ దాని తర్వాత మళ్ళీ థియేటర్ ల కు  రప్పించాయి. అలాగే ఈ ఏడాది కొత్త తారలు టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అందరిని సర్ ప్రైజ్ చేశారు. మంచి విజయాలను అందుకుని దర్శకనిర్మాతల గుండెల్లో ఉండిపోయారు.

 కృతి శెట్టి

మొదటగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్త భామ కృతి శెట్టి. తను చేసిన మొదటి సినిమా ఉప్పెన ఈ సినిమాతోనే తను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు అతను చాలా సినిమాలు చేస్తోంది. తను నటించిన ఉప్పెన సినిమా భారీ కలెక్షన్లను తెచ్చి పెట్టడం జరిగింది. అయితే తాజాగా కృతి శెట్టి నటించిన సినిమా రామ్ సింగ్ రాయ్. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే కాకుండా మరెన్నో సినిమాలు చేస్తోంది కృతి శెట్టి.

 ఫారియా అబ్దుల్లా 

మోస్ట్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. అయితే ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను అందుకుంది.దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన  ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కాకపోతే ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. జాతి రత్నాలు సినిమాతో  హీరోయిన్ గా మన ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఫారియా అబ్దుల్లా మంచి ఫేమ్ ను దక్కించుకుంది.


 శ్రీలీల.

దర్శకులు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన తాజా చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాతో ప్రేక్షకులకు  దగ్గరయింది కన్నడ భామ శ్రీలీల. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. శ్రీకాంత్ పెళ్లి సందడి స్ఫూర్తిగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్లామర్, యాక్టింగ్ పరంగా శ్రీలీల మంచి మార్కులు కొట్టేసింది.

ప్రకాష్ వారియర్

ఒక్క కన్ను కొట్టి ఓవర్నైట్ స్టార్ట్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. 2021లో ఈమె ఎంట్రీ ఇచ్చింది.దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్  సినిమాలో హీరోయిన్ రోల్ చేశారు. తను నటించిన రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో తను ఎలాంటి బ్రేక్ కూడా తీసుకోలేదు.


అమృతా అయ్యర్ 

చెన్నై బ్యూటీ అమృతా అయ్యర్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈమె 2021లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ రెడ్  అనే సినిమాలో తన హీరోయిన్ గా చేయడం జరిగింది. తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.


శివాని రాజశేఖర్

స్టార్ కిడ్ అయిన శివాని రాజశేఖర్  అద్భుతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతం సినిమాలు హీరోకి ప్రేయసిగా మంచి రోల్ చేసింది. తన హీరోయిన్ గా చేసిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కావడం జరిగింది. ఇక ఆ సినిమాలో తన నటన అద్భుతంగా ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: