కరోనా కారణంగా స్టార్స్‌కి వెబ్‌ వరల్డ్‌ మంచి హబ్‌ అయిందట.బిగ్‌స్క్రీన్‌పై తారలు కనిపించని లోటుని వెబ్‌ సిరీస్‌లు కొంతవరకు తీర్చాయని తెలుస్తుంది.

ఈ ఏడాది కొందరు స్టార్‌ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి సందడి చేసారు . హబ్‌బ్బబ్బా.. వెబ్‌బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు చాలా ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌లే అసలైన ఎంటర్‌టైన్‌మెంట్‌. పైగా స్టార్స్‌ చేయడంవల్ల ఈ సిరీస్‌లు బోలెడంత క్రేజ్‌ కూడా తెచ్చుకోగలిగాయని ఆ క్రేజ్‌ని స్టార్స్‌ బాగానే క్యాష్‌ చేసుకున్నారట. మరి.. వెబ్‌ ఉండగానే హౌస్‌ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 

కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించిందటసమంత. ఇటీవల 'పుష్ప' చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లోనూ మెరిసిందని సిల్వర్‌ స్క్రీన్‌ సమంతలోని పాజిటివ్‌ యాంగిల్‌ని చూపిస్తే డిజిటల్‌ వరల్డ్‌ నెగెటివ్‌ యాంగిల్‌ని బయటికి తీసింది. 'ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2' వెబ్‌ సిరీస్‌లో నెగెటివ్‌ షేడ్‌లో కనిపించిందట సమంత. వెబ్‌ ఎంట్రీతోనే ఎల్‌టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారట. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారిందట కానీ 'ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2' స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించిందని తెలుస్తుంది.సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్‌ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయట.

 ఇక మరో టాప్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ 'లైవ్‌ టెలీక్యాస్ట్‌'పై అప్పట్లో వెబ్‌ వ్యూయర్స్‌ ఆసక్తి కనబరిచారని తెలుస్తుంది కానీ వీరి అంచనాలను ఈ సిరీస్‌ అందుకోలేకపోయిందని ఇందులో జెన్నీఫర్‌ మాథ్యూ పాత్రలో కనిపిస్తుందట కాజల్‌. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ 'లైవ్‌ టెలీకాస్ట్‌'కు సరైన వ్యూయర్‌షిప్‌ లభించలేదట. ఈ వెబ్‌ సిరీస్‌ ఎగ్జిక్యూషన్‌లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్‌ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలిపిందట.మరో స్టార్‌ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్‌ సిరీస్‌లు 'లెవన్త్‌ అవర్‌' మరియు 'నవంబరు స్టోరీస్‌' చేసిందట. కేవలం వెబ్‌ సిరీస్‌ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్‌గా కనిపించిందట తమన్నా. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'మాస్టర్‌ చెఫ్‌' షోకు తమన్నా హోస్ట్‌గా కనిపించిందని అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: