పుష్ప క‌థ‌కు సుక్కూ టైప్ లాజిక్కులు ఏవీ లేవు. ఈ క‌థ‌లో అసలు ఉద్దేశం కన్నా కొస‌రు హీరోయిజం ఒక‌టి హైలెట్ అయిందని చాలా మంది పెద‌వి విరిచారు. పోనీ భాష (చిత్తూరు స్లాంగ్)లో ప‌లికించిన డైలాగులు కూడా పెద్ద‌గా ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో సినిమా పై వివాదాల దుమారం రేగింది. స‌మంత పాట కూడా ఓ రేంజ్ వైర‌ల్ అయి వివాదాల‌కు తావిచ్చింది. సినిమా రిలీజ్ కు ముందు దేవీశ్రీ చెప్పిన మాట‌లు కూడా చాలానే వివాదం అయ్యాయి. త‌న‌కు ఐటెం సాంగ్, భ‌క్తి పాట రెండూ ఒక్క‌టేన‌ని చెప్ప‌డంతో హిందూ ధ‌ర్మ సంబంధ సంఘాలు కూడా మండిపడ్డాయి. అయినా కూడా సినిమా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర కాస్తో కూస్తో మార్కులు వేయించుకుంది. అలానే విప‌రీతం అయిన ప‌బ్లిసిటీ కార‌ణంగానే డ‌బ్బులు పిండుకుంది. ఇవ‌న్నీ పుష్ప‌కు ప్ల‌స్ అయ్యాయి. చాలా చౌక బారు క‌థ‌తో సినిమా తీసిన సుక్కూని చాలా మంది విమ‌ర్శిస్తూ ఉన్నా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం వివిధ భాష‌ల్లో సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉన్నాయి. క‌థ ప‌రంగా స‌ప్రైజింగ్ ఎలిమెంట్లు లేకున్నా క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం స‌ప్రైజింగ్ ఎలిమెంట్లు పుష్క‌లంగానే ఉన్నాయి. దీంతో మార్కెట్ లో వివాదాలు ఎన్ని ఉన్నా అవేవీ ప‌ట్టించుకోకుండా పుష్ప సినిమా మ‌న ద‌గ్గ‌రే కాదు ఓవ‌ర్సీస్ లోనూ వ‌సూళ్ల ప‌రంగా సునామీ సృష్టిస్తోంది. ఇక సినిమా క‌థ‌కు కొన‌సాగింపు తీయాల్సిన ప‌ని లేక‌పోయినా ఏదో నాలుగు డ‌బ్బులు రాబ‌ట్టుకునేందుకే పుష్ప 2 ఎనౌన్స్ చేశార‌న్న విమ‌ర్శ‌లు వినిపించుకోకుండా దూసుకుపోయేందుకు సుక్కూ సిద్ధం అవుతుంద‌డం.. అందుకు త‌గ్గ స్క్రిప్ట్ వ‌ర్క్ పై కూడా దృష్టి సారించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇదే ట్రాన్స్ ను కొన‌సాగిస్తూ, అడ‌వి నేప‌థ్యంలో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేయ‌డ‌మే ఇప్పుడొక కామిక‌ల్ పాయింట్. పుష్ప క‌థ‌కే ఏ సీన్ లేద‌ని అంతా న‌వ్వుతుంటే ఇక వెబ్ సిరీస్ చేసి ఏం సాధిస్తార‌ని కొంద‌రి విశ్లేష‌కుల మాట.


ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో....:
పుష్ప సినిమా విడుద‌ల అనంత‌రం సుక్కూ ఐడియాలే మారిపోయాయి. త‌న త‌రువాత సినిమా (పుష్ప 2) కు సిద్ధం అవుతూనే ఎప్ప‌టి నుంచో ఆహాకు చేయాల‌నుకుంటున్న వెబ్ సిరీస్ కు కంటెంట్ ను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి కార‌ణంగా చాలా మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప మొత్తం చుట్టేశారు. ఆ సినిమాకు డిజిట‌ల్ ప్రచారం కార‌ణంగానే అంత పేరు తెచ్చుకుంది. అంతేకానీ వాస్త‌వంగా డిజిట‌ల్ ప్ర‌మోష‌న్ కానీ అల్లు అర్జున్ చెప్పిన మాట‌లు చేసిన హంగామా కానీ లేకుంటే సినిమాకు ఇవాళ ఇంత‌టి హైప్ రాదు. అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ (క‌లెక్ష‌న్ల ప‌రంగా) అయితే అస్స‌లు రాదు. ఇక ఈ సినిమాకు కంటిన్యూష‌న్ ఉంద‌ని పుష్ప ద రూల్ అని ఎప్పుడో చెప్పేశారు క‌నుక ఆ సినిమా పై ఇప్ప‌టి నుంచే ఓ రేంజ్ లో అంచ‌నాలు ఉన్నాయి. కానీ ఈ క‌థ త‌రువాత అయినా రంగ‌స్థ‌లం, ఉప్పెన‌, పుష్ప లాంటి సినిమాలు కాకుండా వేరే ప‌ద్ధ‌తిలో వేరే నేప‌థ్యంలో సినిమాలు ఆయ‌న చేస్తార‌ని అందరూ అనుకున్నా ఇప్ప‌టికిప్పుడు అవేవీ సాధ్యం కావ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: