స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత ప్రాణంగా ప్రేమించి పెద్దల అంగీకారంతో గ్రాండ్ గా పెళ్ళి చేసుకుని నాలుగేళు హ్యాపీగా ఎంజాయ్ చేసి..వన్ ఫైన్ డే విడాకులు తీసుకుంటున్నా అని ప్రకటించి దిమ్మ తిరిగే పోయే షాక్ ఇచ్చింది అభిమానులకి. ఇక తన భర్త నాగ చైతన్య కూడా టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న స్టార్ హీరో కొడుకు..లెజండరీ హీరో మనవడు కావడంతో ఈ విషయం మరింత హాట్ గా మారింది.

ఇక వీళ్ళు విడిపోతున్నాం అని చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ సమంత నాగ చైతన్య వాటిని కొట్టిపరేశారు..అసలు ఏం పట్టించుకోకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఇద్దరు బిజీ బిజీ గా ఉన్నారు.

 ఇకసమంత తో పోల్చుకుంటే నాగ చైతన్య విడాకుల తరువాత డల్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అసలు మీడియా కంట కనపడడమే మానేసారు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండరు. ఇక సినిమాలు కూడా ముందు కమిట్ అయ్యినవి చేస్తున్నాడే కానీ కొత్త సినిమాలు ఏం సైన్ చేయలేదు. దీంతో చైతన్య సమంతను  మర్చిపోలేక కెరీర్ పై ఇంట్రెస్ట్  చూయించట్లేదు అని అభిమానులు అనుకుంటుండగా..నాగచైతన్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

బంగార్రజు  సినిమాలో తనకు జోడీగా నటిస్తున్న లెటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టితో ..అక్కినేని కుర్రాడు చైతన్య కొంచెం క్లోజ్ మూవ్ అవుతున్నాడు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బంగార్రజు  సినిమాలో చైతన్య పక్కన నటిస్తున్న అమ్మడు చైతన్యతో తనకు తెలియకుండానే దగ్గరవుతుందని.. సమంత  జ్ఞాపకాల నుండి బయటపడడానికి హెల్ప్ చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మరోసారి చైతన్య సమంత విడాకుల మ్యాటర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.



 

మరింత సమాచారం తెలుసుకోండి: