టికెట్ రే
ట్ల విషయంలో టాలీవుడ్‌కు మరియు ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్న చిన్న గొడవ కాస్త.. ఇప్పుడు పెద్ద గొడవగా మారుతోంది

ముఖ్యంగా ఇటీవల న్యాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని  టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం అందరికి తెలిసిందే

దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది.. టాలీవుడ్ సినిమాల పై అలాగే హీరోల రెమ్యూనరేషన్స్‌పై వరుసగా కౌంటర్లు వేశారు. ఇక తాజాగా నగరి ఎమ్మెల్యే అయిన రోజా సైతం ఈ విషయంపై గట్టిగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారని పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదు పట్టించు కోవడంలేదు అంటూ రోజా ఫైర్ అయ్యారు. అలాగే నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్ అని ఆయన కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు అంటూ రోజా చురకలు వేశారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుందని తద్వారా సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశముంది అంటూ రోజా హెచ్చరించారని తెలుస్తుంది.. చివరిగా ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను కూడా పరిష్కరిస్తుందని రోజా పేర్కొన్నట్లు సమాచారం.. దీంతో ఇప్పుడు రోజా  చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయని తెలుస్తుంది .రోజా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా వున్నాయి. ఆమె ఎమ్మెల్యే అవ్వకముందు ఆమె వృత్తి సినిమానే అని సినిమాకు అన్యాయం జరుగుతుంటే అలా మాట్లాడటం తప్పు అని కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: