ప్రస్తుతం ఏపీలో ఎలాంటి పరిస్ధితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి జగన్ ప్రభుత్వానికి మధయ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇన్నాళ్లు కరోనా టైం లో లాస్ లో ఉన్న ధియేటర్స్ యాజమాన్యాలకు ఆ పాన్ ఇండియా సినిమా ల ద్వార ఎంతో కొంత లాభం వస్తుంది అని అనుకుని సంబర పడే లోపే ..జగన్ బిగ్ బాంబ్ పేల్చారు.

ఏపిలో సినిమా టికెట్ ధరను తగ్గిస్తూ ఉన్న పలంగా జీవో జారీ చేసారు. సీన్ కట్ చేస్తే..టాలీవుడ్ VS ఏపీ  ప్రభుత్వం ఫైట్ మొదలైంది. జగన్ డెసిషన్ పై సినీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. కొందరు లోలోపల తిట్టుకుంటుంటే మరికొందరు జగన్ ప్రభుత్వం పై డైరెక్ట్ అటాక్ చేస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ హీరో నాని ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని తప్పు పడుతూ.. సినిమా టికెట్ రేట్లు ఇంత తగ్గిస్తే సినిమాలు తీస్తే వచ్చే లాభం కన్నా కిరాణా కొట్టు పెట్టుకున్న  వాడి పనే మేలు అన్నట్లు కామెంట్స్ చేసారు.

ఇక అక్కడి నుండి మొదలైన కధ ఇప్పటికి హాట్ టాపిక్ గానే ఉంది. నాని మాటల పై వైసీపీ నాయకులు రీవర్స్ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లోకి సీనియర్ హీరోయిన్ రోజా కూడా చేరిపోయింది. తాజాగా ఆమె నాని మాటల పై రియాక్ట్ అవుతూ.."నానికి సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉంది అన్నప్పుడు  సినిమాలు చేయడం ఎందుకు దండగా.. వేస్ట్ కదా.. కిరాణా  కొట్టు పెట్టుకుని వ్యాపారమే చేసుకోవచ్చు గా . నాని మాటలు  రెచ్చగొట్టడమే అవుతుందని" రోజా ఫైర్ అయ్యారు.  ఇక తాజా జగన్ నిర్ణయంతో ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. టికెట్ రేట్లు తగ్గించడం పై పలువురు సినీపెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు జగన్ పైన అని కూడా తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: