ఈ ఏడాది సౌత్ స్టార్స్ రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకింది. 'బాహుబలి'తో భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటే అని భావించే రోజు వచ్చేసింది. దీంతో మన స్టార్స్ బాలీవుడ్ హీరోలకు సినిమాల పరంగానే కాకుండా రెమ్యూనరేషన్ పరంగా కూడా దడ పుట్టిస్తున్నారు. అప్పట్లో షారూఖ్ ఖాన్ ఒక సినిమాకి 40 కోట్లు వసూలు చేశాడని తెలిసి అందరూ షాక్ అయిన సందర్భం ఉంది. సల్మాన్ ఖాన్, అమీర్, హృతిక్ మరియు ఇతర పెద్ద బాలీవుడ్ స్టార్స్ చాలా మంది షారుఖ్ రెమ్యునరేషన్‌ కు దగ్గరగా భారీగానే వసూలు చేస్తున్నారు. అది నెమ్మదిగా 100 కోట్లకు చేరింది. ఇక అప్పట్లో తెలుగు స్టార్స్ ఒక్కో సినిమాకి 15 కోట్లకు మించలేదు. కానీ ఇప్పుడు లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మన ఇద్దరు స్టార్ హీరోలు భారతదేశంలో ఏ నటుడూ సినిమాకి వసూలు చేయలేనంతగా, అంటే 100 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... 'బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ మూడు రెట్లు పెరిగింది. ఆయన ఒక్కో చిత్రానికి దాదాపు 100-150 కోట్లు వసూలు చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్‌’, ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ వంటి భారీ సినిమాల‌కు వ‌ర్క్ చేస్తున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఆయన ఒక్కో సినిమాతో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడు. ప్రభాస్‌ కాకుండా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఇంతటి భారీ వసూళ్లు సాధిస్తున్నారు. రూమర్స్ ప్రకారం ఇప్పుడు చెర్రీ వరుసగా శంకర్, గౌతమ్ తిన్ననూరితో చేయబోయే తన తదుపరి రెండు చిత్రాల కోసం 200 కోట్లకు పైగా జేబులో వేసుకోకుంటున్నాడు.

మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి ఇతర హీరోలతో పాటు మరికొంత మంది స్టార్లు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. చాలా మంది మన హీరోలు జాతీయ స్థాయిలో మార్కెట్‌ ను సంపాదించుకుంటున్నారు. దీంతో తెలుగు హీరోలు భారీ కలెక్షన్లు రాబడుతున్నారు. అందుకే నిర్మాతలు మన స్టార్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొన్నాళ్లలో మన తెలుగు హీరోలు ఎంత వరకు రీచ్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: