థియేటర్ లో బొమ్మ అనుకున్న టైం కు వస్తుందో లేదో అన్న డౌట్ ఉంటుంది కానీ ఓటీటీ లో మాత్రం అనుకున్న డేట్ కు సినిమా వచ్చేస్తుంది. స్క్రీన్ చిన్నది అన్న ఒక్క తేడా తప్ప వెండితెర మీద చూపించే సినిమాలకు ఈక్వల్ గా ఇక్కడ సినిమాలు ఆడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆహా లో వస్తున్న తెలుగు ఒరిజినల్స్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. పూరి తెలుగు ఓటీటీ అవడంతో పాటుగా పక్కా ఎంటర్టైనింగ్ యాస్పెక్ట్ లో ఆహా బాగా క్లిక్ అయ్యింది.

థియేటర్ రిలీజైన సినిమాల డిజిటల్ రిలీజ్ తో పాటుగా డిఫరెంట్ షోస్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్న ఆహా ఒరిజినల్ మూవీస్ తో కూడా వస్తుంది. లేటెస్ట్ గా ఆహా లో రాబోతున్న కొత్త సినిమా సేనాపతి. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి సినిమాలను డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని ఎ సేనాపతిని డైరెక్ట్ చేశారు. ఆహాలో డిసెంబర్ 31 నుండి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇక సేనాపతి ట్రైలర్ విషయానికి వస్తే.. గన్ పోగొట్టుకున్న పోలీస్ ఓ పక్క.. ఆ గన్ తీసుకుని బ్యాంక్ లో డబ్బులు కాజేసి.. ఆ డబ్బులని రోడ్డు మీద విసిరేసిన సేనాపతి ఓ పక్క. ఇంతకీ అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడు.. అతని కథ ఏంటి అన్నదే సేనాపతి సినిమా.

రాజేంద్ర ప్రసాద్ కామెడీ మనం అందరు చూశాం.. చూస్తున్నాం.. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సినిమాల్లా మెసేజ్ సినిమాలు చూశాం కానీ సేనాపతిలో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సీరియస్ కథతో సేనాపతిగా వస్తున్న రాజేంద్ర ప్రసాద్సినిమా కోసం బాగా కష్టపడ్డారని అనిపిస్తుంది. ఈ సినిమాను చిరంజీవి తనయురాలు సుస్మిత ఆమె భర్త కలిస్ నిర్మించారు. సేనాపతి ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించగా ఆహాలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: