టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్ ల ఫేట్ ఏ విధంగా ఉంటుంది అంటే పెద్ద హీరోలతో చేసినా కూడా వారికి సినిమా అవకాశాలు, క్రేజ్ అసలే రావు. వారు తమ అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కూడా ఏమాత్రం కూడా విధి వారికి సహకరించదు. తద్వారా వారు అతి తక్కువ కాలంలోనే ఫేడ్ అవుట్ అయిపోయి అదృష్టం లేని హీరోయిన్ ల జాబితాలో నిలిచిపోతారు అలాంటి వారిలో ఒకరు లావణ్య త్రిపాఠీ. 

అందాల రాక్షసి సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ మొదటి చిత్రంతోనే అభినయం పరంగా గ్లామర్ పరంగా మంచి గుర్తింపు సాధించి ఆ తర్వాత వరుస మంచి అవకాశాలతో సంపాదించుకుంది. అలా మొదట్లో లావణ్య పెద్ద హీరోలతో సైతం నటించడం మొదలుపెట్టింది. అలాంటి లావణ్యత్రిపాఠి ప్రస్తుతం చాలా డల్ అయ్యిందని చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకుని కొంత మంది పెద్ద హీరోలతో చేసినా ఆమెకు అవి కలిసి రాకపోవడంతో ఇప్పుడు ఆమె నిరుత్సాహ పడుతుంది.

ఈమె దాదాపు అందరు మెగా హీరోలతో సినిమాలు చేసినా కూడా ఆమెకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడంలేదు. దర్శకులైన హీరోయిన్ అయినా మెగా కాంపౌండ్ లోకి వెళితే తప్పకుండా స్టార్ స్టేటస్ పొందవచ్చు అని అనుకుంటారు. అలాంటి లావణ్య త్రిపాఠి కి ఒక మెగా హీరో కూడా కలిసి రాకపోవడం అంటే అది నిజం గా ఆమె దురదృష్టం అని చెప్పాలి. ఆమె అల్లు శిరీష్ తో కలిసి నటించిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా మాత్రమే పరవాలేదనిపించగా మిగతా వారితో ఎవరితో నటించిన కూడా ఆమెకు దారుణమైన ఫ్లాప్ లు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద గా సినిమా లేవని చెప్పాలి.  మరి ఆమె అవకాశాలు ఎలా సంపాదించుకుంటుందో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: