ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా విడుదల అవుతున్నాయి. ఆ విధంగా ఓ టీ టీ లో విడుదలయ్యే సినిమాలు కొన్ని థియేటర్లలో విడుదల అయితే బాగుండు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఈ చిత్రాలు ఓ టీ టీ లో విడుదల అవుతూ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే థియేటర్ లలో సినిమా చూడడానికి ఇష్టపడే చాలా మంది ఓ టీ టీ లలో విడుదలై ఘన విజయాలు సాధించగా ఆ సినిమాలు థియేటర్లలో విడుదల అయితే హీరోలకు ఇంకా బాగా మైలేజ్ వచ్చేది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అలా ఓ టీ టీ లో విడుదలైన ఏ సినిమాలు థియేటర్ లలో విడుదల అయితే బాగుంటాయో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఓ టి టీ లో విడుదలైతే బాగుండేదని విక్టరీ అభిమానులు మొదటి నుంచి అనుకున్నారు. ఈ చిత్రం రీమేక్ సినిమానే అయినా కూడా వెంకటేష్ అద్భుతమైన నటన ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయితే బాగుండు అనడానికి ముఖ్య కారణం అవుతుంది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచిన వెంకటేష్ ను పెద్ద తెరపైన చూస్తే ఇంకా అదిరిపోయేదని అభిమానులు చెబుతున్నారు. 

అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన మరొక చిత్రం దృశ్యం 2 కూడా థియేటర్ లలో చూడవలసిన సినిమా. నితిన్ హీరోగా చేసిన మ్యస్ట్రో చిత్రం కూడా థియేటర్ కంటెంట్ ఉన్న సినిమానే. బాలీవుడ్ రీమేక్ అయిన ఇది హాట్ స్టార్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక హీరో సంతోష్ నటించిన ఏక్ మినీ కథ, సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా మరియు జై భీమ్, హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన రాధే వంటి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే కంటెంట్ ఉన్న సినిమాలు కాగా ఈ సినిమాలు ఓ టీ టీ లో  విడుదలై సూపర్ సక్సెస్ ను సాధించాయి. అయితే ఇది ప్రేక్షకులను ఎంతగానో నిరుత్సాహ పరిచింది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: