సాధారణంగా హీరోలు అంటే వారి లైఫ్ స్టైల్ అలాగే వారి వ్యక్తిగత జీవితం మరియు వారు వేసుకునే దుస్తులని ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీలో వారిని ప్రేక్షకులు అందరూ శ్రీమంతుడు లాగా చూస్తూ ఉంటారు.

కానీ టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తాను ఐశ్వర్యవంతుడిని కాను అని అంటున్నారట.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి ఏర్పరచుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు రామ్ చరణ్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడని తెలుస్తుంది.. అంతేకాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాతగా కూడా మారాడు. అయినా కూడా తాను ధనవంతుడిని కాదు అంటున్నాడట రామ్ చరణ్. ఇదే విషయాన్ని తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి బిజీ బిజీగా ఉన్నారని సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను స్పీడప్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగా ముంబైలోని ఒక టీవీ షో కి వెళ్లారట. అక్కడ రామ్ చరణ్ తో తాను ధనవంతుడిని కాదు అన్న విషయాన్ని ఆయనతో చెప్పించారు హోస్ట్ కపిల్ శర్మ.

షో లో భాగంగా కపిల్ శర్మ రామ్ చరణ్ ను మీకు విమానం కంపెనీ, హోటల్స్ అలాగే హాస్పిటల్స్ ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి అంట కదా.. అలాంటప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇలా సినిమాలు ప్రమోషన్లు అంటూ పరుగులు పెడుతున్నారు అని ప్రశ్నించారట... ఆ విషయంపై స్పందించిన చెర్రీ నవ్వుతూ.. నాకు విమానాల కంపెనీ లేదండీ అదే ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటూ బదులిచ్చారట.. అలాగే డబ్బులు లేవు కాబట్టి సినిమాలో యాక్ట్ చేస్తున్న అంటూ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడని సమాచారం.న్యూ ఇయర్ కి స్పెషల్ గా చేసిన ఈ ప్రోమో రిలీజ్ అయిందని ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: