క‌వికి స్థిర స్థానం చ‌దువ‌రి హృద‌య పీఠం..
అక్క‌డి నుంచి వినిపించే గొంతుకే
రేప‌టి క‌వుల‌కు దిశానిర్దేశాలు...



వెన్నెల క‌వి మ‌ర‌ణం నుంచి వెన్నెల క‌వి విదిలించిన విషాదం వ‌ర‌కూ మ‌రో ఏడాది మ‌రో యుగం మ‌రో త‌రం అలానే ఉండిపోతుం దని అనుకోలేం. కానీ నిబ‌ద్ధ‌త‌తో కూడిన పాట‌కు కొత్త ఆయువు అందించిన మంచి క‌వి ని వ‌దులుకుని ఈ ఏడాదిని ముగించ‌డం లో అర్థం ఉన్నా లేకున్నా భ‌రించ‌లేని బాధ‌కు ఇదొక అసంద‌ర్భ సంద‌ర్భం అయి ఉంటుంది. వెన్నెల క‌వి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి (ఈయ‌న‌ను గాయ‌కులు ఎస్పీ బాలు తూర్పు క‌వి అని వ్య‌వ‌హ‌రిస్తారు).. ఎన్నో మంచి పాట‌లు రాసిన మేలుకొలుపు రాముడు..ఈయ‌న.. తెలుగు పాట‌కు చిర ఖ్యాతి ఇచ్చి వెళ్లాక ఇప్పుడాయ‌న ఎక్క‌డున్నార‌ని! చెప్పాను క‌దా హృద‌య పీఠం ఆత్మ గ‌తం అయిన క‌వి ఆయ‌న.. మృత సంబంధ ఛాయ‌లు న‌మ్మ‌కండి నా ప్రియ జ‌నులారా మీరంతా ఆనందించాలి.. మంచి పాట‌కు మ‌రికొంద‌రు కొత్త ఆయువు నింపేందుకు ప్ర‌య‌త్నాలు ఆయ‌న స్ఫూర్తితో చేయ‌గ‌ల‌ర‌ని! వెన్నెల కవిది నా ప్రాంతం.. అత‌డు నా క‌వి..అత‌డు నా మ‌నిషి అని రాయ‌డంలో త‌ప్పు లేదు. సొంతం చేసుకోవ‌డంలో త‌ప్పు ఏముంద‌ని!


పాఠాలు చెబుతున్న మాస్టారిని అడిగాను...స‌ర్..సిరివెన్నెల‌కు నివాళి ఇవ్వాలి మ‌నం అని! క్లాస్ చెబుతున్నాను పూర్త‌వ్వ‌గానే మ‌నం త‌ప్ప‌క వారిని సంస్మ‌రిద్దాం అని చెప్పారు స‌ర్.. స‌ర్ అంటే నాకో స్ఫూర్తి ( కామేశ్ స‌ర్ , స‌న్ కాలేజీ డైరెక్ట‌ర్).. మంచి విద్యార్థులు అన్ని చోట్లా ఉండ‌రు.. అంద‌రూ ఆ నిర్వ‌చ‌నానికి తూగ‌రు.. అటువంటి స్థాయి అందిరికీ రాదు.. కానీ కొంద‌రే మంచి మాస్టార్లు ఇలాంటి క‌వుల‌ను ముందుగా గుర్తించి నీవు రాయాలి.. ఈ జాతి పొంగిపోవాలి అని చెబుతారు.. అందుకే నాలాంటి సామాన్యుల‌కు ఇలాంటి మాస్టార్లే స్ఫూర్తి ఈ ఉద‌యాన..


నిష్కళంక చ‌రితను ప్రేమించి ఒంట‌రి పొద్దుల చెంత ఓట‌మ‌లు వెతికి భ‌వ్య‌మ‌యిన జీవితం ఒకటి వెత‌కాలి.. జీవ ధార‌ల ద‌గ్గ‌ర ప్రేమామృతం అయిన వెన్నెల  సోన‌ల‌ను ఆహ్వానించాలి.. ఆఖ‌రి నిబ‌ద్ధాక్షరి అని రాశాను వెన్నెల క‌వి గురించి.. నివాళి ఇస్తూ..ఈ ఏడాది విషాదంలో ఇంత‌కుమించిన మాట మ‌రొక‌టి లేదు. రాదు కూడా! నివాళికో నిర్వ‌చిత స్థానాన్నీ, ఆచ‌ర‌ణ పూర్వ‌క ప్ర‌శ‌స్తిని పొంది ఉంచాలి.. ఇవాళ తెలుగు పాట కోరుకుంటున్న మంచి వాగ్ధార ఒక‌టి ప్ర‌తి చోటా ప్ర‌తి క‌విలో ఉంటే మేలు.. ఆ స్థాయికి ఒక సాకీ చేరుకున్నా మేలు.

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: