బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా కండలవీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీన తన 56 వ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోవడం విశేషం. అయితే ప్రతి ఏడాది కూడా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి పన్వెల్ లో వున్న తన ఫామ్ హౌస్ కి వెళ్లే వారు. అక్కడే ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ గా పార్టీని కూడా అరేంజ్ చేసేవారు. అనుకున్నట్లుగానే ఈ ఏడాది కూడా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడానికి ఆ ఫామ్ హౌస్ కి వెళ్లారు సల్మాన్ ఖాన్..


అనుకోకుండా అక్కడ ఆయన పాముకాటుకి గురవడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ సల్మాన్ కు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రమాదం లేనందువల్ల ఆయన తన పుట్టినరోజు వేడుకలను యధావిధిగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆయన పలువురు సన్నిహితులు.. స్నేహితుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సెలబ్రిటీ కపుల్ అయిన జెనీలియా ,డిసౌజా , రితేష్ దేశ్ముఖ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.


అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో జెనీలియా, సల్మాన్ ఖాన్ అదిరిపోయే పాటకు కలిసి డాన్స్ వేశారు. ప్రస్తుతం డాన్స్ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా జెనీలియా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియోలో వీరిద్దరూ కూడా మెరూన్ కలర్ టీ షర్ట్ ధరించి.. డెనిమ్ జీన్స్ వేసుకుని డాన్స్ వేయడం చాలా కనులవిందుగా కనిపించింది. ఇకపోతే ఆమె ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఎంతో మంచి మనసున్న వ్యక్తి కి నా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకు ప్రేమ.. ఆరోగ్యం . సంతోషం.. ఎప్పటికి దొరకాలని కోరుకుంటున్నాను.. అంటూ ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: