పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయన సినిమా విడుదల అయితే బాక్సాఫీస్ దగ్గర ఏలాంటి కోలాహలం నెలకొంది ఉంటుందో కూడా మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు  బయట ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఇండస్ట్రీలో కూడా అదే రేంజ్ లో  అభిమానులు ఉన్నారు, ఇండస్ట్రీలో చాలా మంది పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ అంటే ఇష్టం,  పవన్ కళ్యాణ్ నటన అంటే ఇష్టమని ఇలా ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ ను గురించి ఇండస్ట్రీ ప్రజలు చెబుతూ ఉంటారు.

 అలాగే దర్శకులు, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి,  అయితే పవన్ కళ్యాణ్ తో నటించే హీరోయిన్ లు కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు, ఆయన వ్యక్తిత్వం గొప్పది అని , అలాగే ఆయన మనసు చాలా గొప్పది అని చాలా మంది హీరోయిన్ లు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది, నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్,  ఆయన అదిరిపోయే టెర్రిఫిక్ పర్ఫామెన్స్, ఆయన దేవుడి ఆశీస్సులతో కలిగిన వన్ మెన్ ఆర్మీ లాంటి వారు అంటూ సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ రాసుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు, కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: