టాలీవుడ్ లవ్ బర్డ్స్, బ్యూటిఫుల్ స్వీట్ కపుల్ గా నీరాజనాలు అందుకున్న అక్కినేని నాగచైతన్య- సమంత ల జంట మూడు నెలల క్రితం విడాకులు అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ముందు స్నేహం, ఆ తర్వాత ప్రేమ, నాలుగేళ్ల వివాహ బంధం వ్యక్తిగత మనస్పర్ధలు కారణంగా అన్ని సంవత్సరాల బంధం ఒక్క సారిగా ముక్కలయ్యింది. ఈ విషయం తెలిసి వారి బంధుమిత్రులు కాదు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటికీ వీరి జంట విడిపోయింది అనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. అయితే ఇంతలోనే మరో స్టార్ సెలబ్రిటీ జంట విడిపోబోతుంది అంటూ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఇంతకీ ఆ టాప్ సెలబ్రిటీ జంట మరెవరో కాదు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ ఆయన భార్య. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. 2008 లో పెళ్లి బంధంతో ఒకటి కాగా బ్లెస్సికా, కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే 13 సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా జీవించిన ఈ జంట ఇపుడు విడిపోబోతోంది అంటే అందరూ ఎంతో బాధపడుతున్నారు.

సౌత్ లో పలు భాషల్లో దాదాపు 100 చిత్రాలకు పైగా సంగీతం అందించిన ఇమ్మాన్ అందరికీ సుపరిచితులే. కాగా ఆయన తన భార్యతో మోనికా రిచర్డ్ నుండి విడిపోతున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదిక పై తీవ్రంగా ఆందోళన తెలియచేస్తున్నారు. వీరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వస్తున్న చిన్న చిన్న మనస్పరదాలే అని తెలుస్తోంది. ఇలా జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇండస్ట్రీలో ఎందరో ఇలా ప్రేమించుకుని విడిపోయారు, మరి కొందరు ఇలా పెళ్లి చేసుకుని విడిపోయారు. కానీ పిల్లలు కలిగాక కూడా విడిపోవాలి అని అనుకోవడం నిజముగా దురదృష్టకరం అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: