బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి కాగా బిగ్ బాస్ లవర్స్ కు ఓటీటీ బిగ్ బాస్ అంటూ ఓ గుడ్ న్యూస్ తో వచ్చారు బిగ్ బాస్ టీం. నాగార్జున తో కలిసి రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి మరి బిగ్ బాస్ ఓటీటీ తెలుగు గురించి చెప్పారు. ఇక అప్పటి నుండి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అప్డేట్స్ తో హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఓటీటీ బిగ్ బాస్ కోసం ముగ్గురు కంటెస్టంట్స్ కూడా సెలెక్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం సడెన్ గా హోస్ట్ ని ఛేంజ్ చేశారట బిగ్ బాస్ టీం.

అదేంటి నాగార్జున కాకుండా ఈ షోని ఎవరు హోస్ట్ చేస్తారని అనుకోవచ్చు. హిందీ బిగ్ బాస్ ని ఫాలో అవుతూ అసలు బిగ్ బాస్ ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుంటే బిగ్ బాస్ హిందీ ఓటీటీ కరణ్ జోహార్ హోస్ట్ గా చేశారు. ఇక ఇప్పుడు అదేవిధంగా తెలుగు ఓటీటీ బిగ్ బాస్ ని కూడా ప్రముఖ యాంకర్, డైరక్టర్ ఓంకార్ చేత హోస్టింగ్ చేయించాలని చూస్తున్నారట. యాంకర్ గా.. షో హోస్ట్ గా ఓంకార్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికి షాక్, ఇస్మార్ట్ జోడీ షోలకు హోస్ట్ గా చేస్తున్నారు ఓంకార్.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం కూడా హోస్ట్ గా మారబోతున్నాడని టాక్. అంతేకాదు ఓంకార్ ఓం ఎంటర్టైన్మెంట్స్ తోనే బిగ్ బాస్ టీం చేతులు కలిపి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ మారుతున్నాడని మాత్రం వార్తలు గట్టిగానే వస్తున్నాయి. అయితే నాగ్ బదులుగా ఓంకార్ హోస్ట్ గా చేస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 2022 ఫిబ్రవరిలోనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ స్టార్ట్ అవుతుందని టాక్. ఓటీటీ బిగ్ బాస్ 24 అవర్స్ టెలికాస్ట్ అవుతుందని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: