సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ సుక్కు డైరక్షన్ టాలెంట్ చూసి ఆయన దగ్గర అసిస్టెన్ గా చేస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ఇది నిజం అనేలా చేశాడు తెలుగు దర్శకుడు సంపత్ నంది. పుష్ప గ్రాండ్ సక్సెస్ అయినందుకు టాలీవుడ్ డైరక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పుష్ప గురించి తెలుగు దర్శకులంతా వారికి కలిగిన అనుభూతిని పంచుకున్నారు. ఈ క్రమంలో అందరు సుకుమార్ డైరక్షన్ గురించి సూపర్ గా పొగిడారు.

ఇక వీరిలో సంపత్ నంది మాత్రం సుకుమార్ సర్ డైరక్షన్ అదరఒట్టారు. ఆయన సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఆయన నుండి ఇలాంటి మాస్ సినిమా రావడం మా లాంటి మాస్ డైరక్టర్ కు షాక్ అని అన్నారు సంపత్ నంది. సినిమాలో అన్ని బాగా కుదిరాయని. సినిమా చూశాక సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేయాలని ఉందని అన్నారు సంపత్ నంది. తనకు అసిస్టెంట్ గా చేసిన అనుభవం లేదని డైరెక్ట్ గా వచ్చి సినిమా చేశానని. కుదిరితే ఒక షెడ్యూల్ వరకు అయినా సుకుమార్ దగ్గర అసిస్టంట్ గా పనిచేస్తానని అన్నారు సంపత్ నంది.

తన మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే సంపత్ నంది సుకుమార్ దగ్గర అసిస్టంట్ గా జాయిన్ అవుతా అనడం అందరికి షాకింగ్ గా అనిపించింది. పుష్ప డైరక్టర్స్ పార్టీలో తెలుగు చల చిత్ర దర్శకులు.. ప్రస్తుతం ఫాం లో ఉన్న అందరు ఈ పార్టీకి వచ్చారు. ఇందులో వివేక్ ఆత్రేయ, రాహుల్ సంకృత్యన్ లాంటి యంగ్ టాలెంటెడ్ డైరక్టర్స్ కూడా అటెండ్ అవడం విశేషం. .రాఘవేంద్ర రావు దగ్గర నుండి ఒకటి రెండు సినిమాలు చేసిన డైరక్టర్స్ అంతా ఈ పార్టీలో పాల్గొన్నారు. మొత్తానికి పుష్ప విషయంలో అల్లు అర్జున్ మొదట్లో చెప్పిన జోస్యం నిజమైందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: