దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు ఆంక్షలు పెట్టి జనాన్ని కట్టడి చేస్తున్నారు. ఇన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ వెనకడుగు వేయడంలేదు మొండి ధైర్యంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లవరకు జరిగింది.


ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు లాభపడాలి అంటే కనీసం ఈ 600 కోట్లు ముందు వసూలు కావాలి. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఆశాజనిక వాతావరణం కనిపించకపోయినా మొండిగా ‘ఆర్ ఆర్ ఆర్’ వేస్తున్న ముందడుగు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 1000 కోట్ల వసూళ్ల లక్ష్యంగా బరిలో దిగుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది అన్నసందేహాలు ఇండస్ట్రీలో చాలామందికి ఉన్నాయి.




ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ ఆగడం లేదు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ కు అత్యంత కీలకమైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగలేదు. దీనితో ఆలోటును సరిచేయడానికి డిసెంబర్ 31 రాత్రి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి ముంబాయ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జీ ఛానల్ ద్వారా 31 రాత్రి 11గంటలకు ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ నాన్ థియేట్రికల్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకున్న నేపధ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జీ ఛానల్ ప్రసారం చేస్తోంది. ఈ ఈవెంట్ లో చరణ్ తారక్ డాన్స్ చేశారు. వీళ్లతో పాటు సల్మాన్ కూడా డాన్స్ చేశాడు శ్రియ కరణ్ జోహార్ అలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవన్నీ డిసెంబర్ 31 రాత్రి బుల్లితెర ప్రేక్షకులు చూడబోతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: