మేం ఎలా ఉండాలో ఏ విధంగా న‌డుచుకోవాలో
ఇత‌రుల విష‌యంలో ఏ విధంగా ప్ర‌వ‌ర్తించాలో
చెప్పే హ‌క్కు సమంత‌కు ఉంది కాద‌నం అదే స‌మ‌యంలో
అస‌భ్య రీతిలో భార‌తీయ స‌మాజం ఒప్పుకోని రీతిలో
తిరుగాడే సంస్కృతిని  నెత్తిన పెట్టుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం కూడా
మా హ‌క్కే! అని అంటున్నారు అక్కినేని అభిమానులు



గుడిపాటి వేంక‌టా చ‌లం అనే వ్య‌క్తి కార‌ణంగా రెక్క‌లు తొడిగి రెప‌రెప‌లాడి పోతోంది ఆ ప‌దం.. అదే స్వేచ్ఛ.. ఆ రెండ‌క్ష‌రాల ప‌దం చుట్టూ ప్ర‌తిరోజూ అమ్మాయిలు యుద్ధం చేస్తున్నారు. దేహాన్ని కప్పుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే దుస్తులు పాపం ఎందుక‌నో అవి ప‌నికిరాకుండా పోతున్నాయి.. అంద‌రికీ అన్నీ అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు కానీ పేరు కీర్తి డ‌బ్బు అన్న‌వి కొంద‌రికి అందుబాటులోకి వ‌చ్చాక వాటికో కొత్త భాష్యం వెతుకుతారు.. మా ఇష్టం మా జీవితం అన్న‌వి గొప్ప‌వి.. అవి ఎవ‌రికి?

 
ఎంత‌వ‌ర‌కూ? అవును ఇదే సమంత గోవా బీచ్ లో ఆఫ్ న్యూడ్ సెన్స్ తో తిరిగితే అదేలేండి సినిమాల్లో తిరిగితే లేని అభ్యంత‌రం ఇక్క‌డెందుకు అని కూడా అంటున్నారు కొంద‌రు.. కాద‌నం కానీ భార‌తీయ సంస్కృతి వీడిని ఒప్పుకోవ‌డం లేదు. మీరు బ్రిట‌న్ కు పోయి అక్క‌డ నుంచి గెంతులు వేయ‌డం నేర్చుకోండి ఎవ్వ‌రూ కాద‌నరు.. అని ఇంకొందరు మాట్లాడుతున్నారు. అయినా అక్కినేని ఇంటి ప‌రువు తీసే క్ర‌మంలో ఆమె ఉన్న‌ద‌న్న‌ది ఓ అభిమాని నాతో అన్నాడు.. ఇదొక్క‌టే నాకు అంగీకారంగా ఉంది.. నా గ‌చైత‌న్య తో ఉండ‌మ‌ని జీవించ‌మ‌ని చెప్ప‌ను కానీ మ‌రీ! వ‌ల్గ‌ర్ గా ప్ర‌వ‌ర్తించి ఆ ఇంటి ప‌రువు తీయొద్ద‌ని మాత్ర‌మే గ‌తంలో ఆమెను అభిమానించిన వ్య‌క్తిగా చెప్ప‌డం నా బాధ్యత అని అదే అభిమాని అంటున్నాడు నాతో! ఇదే మాట  నెటిజ‌నులు చాలా మంది రాశారు..వినిపించారు కానీ ఇవేవీ ఆమెకు ప‌ట్ట‌క పోవ‌డ‌మే విడ్డూరం.


దుస్తులు అన్న‌వి హానికరంగా ఉంటాయి..దుస్తుల‌న్న‌వి పేజ్ 3కు ప‌నికి వ‌చ్చేలా ఉంటాయి..దుస్తుల‌న్న‌వి ట్రోలింగ్ కు ఉప‌యోగ‌ప‌డేలా ఉంటాయి. ఏదో ఒక‌టి అనుకోండి. దుస్తులు అంటే సామాన్యుల‌వి అని కాదు సెల‌బ్రిటీల‌కు సంబంధించిన‌వి.. నాగ చైత‌న్య భార్య స‌మంత గానే ఆమెను ఇప్ప‌టికీ గుర్తిస్తారు అన్న ఆలోచ‌న కానీ అక్కినేని కోడలిగానే ఆమెకు ఓ గుర్తింపు ఇప్ప‌టికీ ఉంద‌ని కానీ సోయి లేకుండా గోవా తీరాల్లో అందాలను షో చేస్తున్న స‌మంతపై కొంద‌రికి కోపం ఉంది. కొంద‌రు మాత్రం అది ఆమె స్వేచ్ఛ అని అంటున్నారు. స్వేచ్ఛ అనే పెద్ద ప‌దం ఈ సెల‌బ్రిటీ విష‌య‌మై ఎందుక‌నో తూకం చెల్ల‌కుండా పోయింది. తూగ‌డం లేదు కూడా! స‌రిగా! అయినా గోవాలో ఆమె ఏం చేసుకుంటే నీకెందుకు ఎవ‌రెవ‌రితోనో చిందులు వేస్తే నీకెందుకు అని కొంద‌రు హిత‌వు చెబుతున్నారు.. నెట్టింట్లో! ఆ విధంగా కూడా ట్రోల్ చేస్తున్నారు స‌మంత‌ను! బాగుంది ఆమె స్వేచ్ఛ‌కు ఆ ఫొటోల‌కూ అస్స‌లు సంబంధం ఏమ‌యినా ఉందా?





మరింత సమాచారం తెలుసుకోండి: