తెలుగు గ‌డ్డ‌పై రోజా పేరు ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. రెండున్న‌ర ద‌శాబ్దాల కింద‌ట రోజా స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా స్టార్ హీరోల ప‌క్క‌న ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించారు రోజా. చిత్తూరు జిల్లాకు చెందిన రోజా 1990 ద‌శ‌కంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీని ఏలారు. అప్ప‌ట్లో ర‌మ్య‌కృష్ణ‌, మీనా, న‌గ్మా, సౌంద‌ర్య‌, ఆమ‌ని లాంటి స్టార్ హీరోయిన్‌ల‌కు పోటీగా ఎన్నో సినిమాల‌లో న‌టించి టాలెంట్ ను నిరూపించుకున్నారు.

ఈ త‌రుణంలోనే రోజా చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో దూసుకెళ్లింది. అయితే స్టార్ హీరోల అంద‌రికీ సూప‌ర్ హిట్లు ఇచ్చిన రోజా.. మ‌రొక సీనియ‌ర్ హీరో నాగార్జున‌కు మాత్రం ఆమె ఐర‌న్ లెగ్‌గా మారింద‌ని చెప్పొచ్చు. రోజా, నాగార్జున కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు అన్నీ డిజాస్ట‌ర్స్ అయ్యాయి. 1993లో అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఉప్పల‌పాటి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ర‌క్ష‌ణ సినిమా వ‌చ్చిన‌ది. ఈ చిత్రంలో నాగార్జున‌-శోభ‌న ఇరువురు క‌లిసి న‌టించారు. రోజా ప్ర‌త్యేక గీతంలో న‌టించిన‌ది. అయితే ర‌క్ష‌ణ బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియల్ గా అంత‌గా విజ‌యం సాధించ‌లేదు.

ఆ త‌రువాత 1995లో ఎస్‌వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌జ్రం సినిమా వ‌చ్చిన‌ది. ఈ చిత్రంలో నాగార్జున‌, రోజా హీరో, హీరోయిన్లుగా న‌టించారు. అంత‌కుముందు ఎస్‌వీ కృష్ణారెడ్డి కొబ్బ‌రిబోండాం, మాయ‌లోడు, రాజేంద్రుడు-గ‌జేంద్రుడు, నెంబ‌ర్ వ‌న్‌, య‌మ‌లీల లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో టాప్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. అలాంటిది ఎస్‌వీ కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన వ‌జ్రం సినిమా మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద డిజాస్ట‌రే అయింది. ఆ విధంగా రోజా-నాగార్జున కాంబినేష‌న్‌కు ఏమాత్రం క‌లిసి రాలేదు.  ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమె ముందు తెలుగుదేశం పార్టీలోకి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత వైఎస్సార్‌సీపీ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె వైసీపీ నుంచి న‌గరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: