ప్రముఖ హీరో గా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి కుమార్. ఇక ఈయన తన వాయిస్ ద్వారా హీరోలకే హీరోయిజం ను తెచ్చి పెట్టాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా కొత్త సంవత్సరం పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈయనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ఆరంభం అయిన శనివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం.. కొంత మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు కొన్ని రంగాలకు చెందినవారు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

ఇక అలా ఈ  కొత్త ఏడాది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో హీరో సాయి కుమార్ కూడా ఒకరు. ఇక ఈయన స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.. కుటుంబంతో కలసి విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న ఈయన..ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. అంటే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు ఈ ఏడాదితో పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. అంతే కాదు ఈ సంవత్సరం పలు భాషా చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు సాయి కుమార్ వెల్లడించారు.


ఇకపోతే ఏపీలో జరుగుతున్న టికెట్ రేట్ల విషయం పై ప్రభుత్వం కమిటీని వేసిందని.. వర్చువల్ గా జరిగిన ఈ కమిటీ సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని సాయి కుమార్ వెల్లడించారు.. ఇక ఉన్న వాడి నుంచి లేని వాడి వరకు ప్రతి ఒక్కరికి టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలని త్వరలోనే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కూడా లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాకపోతే ఏపీ లో చాలా తక్కువ ధరలకే టికెట్లు రేట్లు నిర్వహిస్తుండగా తెలంగాణలో అందుకు భిన్నంగా  ధరలను పెంచే చేసిన తీరుపై సాయి కుమార్ మండిపడ్డారు. ఇక ఏది ఏమైనా త్వరలోనే ఈ టికెట్ల విషయంపై సమస్య ఒక కొలిక్కి వస్తుంది అన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: