అఖిల్ అక్కినేని హీరోగా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గోపిసుందర్ సంగీతం అందించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత హిట్ కొట్టింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి వంటి భారీ పాన్ ఇండియా మూవీ తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తుండగా యువ సంగీత సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల ఎంతో వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీ కొన్నాళ్లుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్ ఈ సినిమాలో ఒక రా ఏజెంట్ పాత్ర చేస్తుండగా ఆయనకి జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాలోని ఏజెంట్ పాత్ర కోసం కొన్నాళ్లుగా ఎంతో భారీ గా బాడీ పెంచిన అఖిల్ అక్కినేని, నేడు ఏజెంట్ మూవీలో ఒక బేర్ బాడీ లుక్ ని రిలీజ్ చేసారు.

సిక్స్ ప్యాక్ తో అదిరిపోయే లుక్ లో కారు అద్దం దగ్గర అక్కినేని అఖిల్ నిలబడి ఉన్న ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఈ ఏడాది మధ్యలో రిలీజ్ చేయనున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: