అభిమానులకు తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్లు ఏం చేసినా.. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సినిమా రిలీజ్ అవుతుందన్నా.. తన జీవితంలో వేరే వ్యక్తి రాబోతున్నారంటే ఎంతో సంతోషిస్తారు. తనతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారనే విషయం అభిమానులకు పెద్ద పండగే. పెళ్లి చేసుకుంటున్నారనే విషయం తెలిస్తే ఇక ఆ సంతోషం ఎంతో రెట్టింపు అవుతుంది. అయితే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా దాచి పెట్టి.. పెళ్లి తర్వాత చెప్తే.. ఇంకేముంది.. ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అలాంటి విషయమే బాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొత్త ఏడాదిలో జనవరి 1వ తేదీన పెళ్లి చేసుకుని అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

మోహిత్ రైనా పెళ్లి చేసుకున్న విషయాన్ని స్వయంగా తానే ప్రకటించాడు. వాస్తవానికి సెలబ్రిటీల పెళ్లంటే ఎంతో సందడిగా ఉంటుంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండా మోహిత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితురాలైన అదితి అనే యువతితో మోహిత్‌కు వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో వీరి జంట ఎంతో చూడముచ్చటగా ఉందని నెటిజన్ల చెబుతున్నారు. తెలుపు రంగు షెర్వాణీ, వైట్ టర్బన్‌లో మోహిత్ రాజకుమారుడిలా కనిపిస్తున్నాడు. అదితి పసుపు రంగు లెహంగాలో మెరిసిపోయింది. వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే జరిగింది.

మోహిత్ రైనా టీవీ నటుడు. ఎన్నో సూపర్ హిట్ హిందీ సీరియళ్లలో నటించారు. 2005లో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘దేవోంకి దేవ్.. మహాదేవ్’ సీరియల్‌లో శివుడి పాత్రలో నటించారు. ఆ సీరియల్‌ బాగా పాపులర్ కావడంతో మోహిత్‌కు మంచి క్రేజ్ పెరిగింది. 2019లో వచ్చి ‘యురి – ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో కీ రోల్‌లో నటించాడు. ఆ తర్వాత ‘సీరియల్ కిల్లర్, శిద్దత్, గుడ్‌న్యూస్’ సినిమాలు.. ‘ఏ వైరల్ వెడ్డింగ్, ముంబై డైరీస్ 26/11’ వంటి వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: