సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లు అందరూ తాము మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర  బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకని ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవ్వాలి అని భావిస్తూ ఉంటారు.  కానీ అలా భావించిన ఎంతో మంది లో కొంతమంది మాత్రమే అలా మొదటి సినిమాతోనే సక్సెస్ అవుతూ ఉంటారు, అలా మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన వారిలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాల ద్వారానే ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత సినిమాతోనూ అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఉప్పెన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

 దానితో కృతి శెట్టి కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి, అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ మధ్యనే థియేటర్ లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి విజయం వైపు దూసుకుపోతోంది. అలాగే నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో కూడా కృతి శెట్టి,  నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా లోనూ కృతి శెట్టి నటిస్తోంది, అలాగే  రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఒక్క సినిమా విజయం తోనే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఒక వైపు కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్ లలో సందడి చేస్తూ ఉంటే మరో వైపు ఈ ముద్దుగుమ్మ నటించిన బంగార్రాజు సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది, అలాగే సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మధ్యనే విడుదల చేశారు. ఇలా కృతి శెట్టి జోరు ఈ సంవత్సరం ప్రారంభం నుండే ఫుల్ గా కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: