బిగ్ బాస్ సీజన్ 5 ఎన్నో సరదా ఆటలు .. మరెన్నో గోడవలు మధ్య నానా హంగామ చేసి ఫైనల్ గా కప్ ఎగరేసుకుపోయాడు సన్నీ. హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ వెళ్లినా ఫైనల్ గా గా కప్ గెలిచేది ఒక్కరే అని అందరికి తెలిసిన విషయమే. కానీ అందరు తమ తమ స్టైల్లో ఆటలు అడూతూ స్ట్రాటజీలు ఫాలో అవుతూ వచ్చారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ సన్నీ గెలుచుకున్నా..కానీ, ఆయన కంటే ఎక్కువుగా అభిమానుల మనసుల్లో స్దానం సంపాదించుకున్నారు మానస్.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకి  మానస్ చాలా స్పెషల్ క్యారెక్టర్. తన లోకం తనది అన్నట్లు ఉంటాడు. ఎక్కువ గొడవలకు వెళ్లడు. గేం అంటే చెలరేగిపోతాడు.. నిజాయితీగా ఆడతాడు. ఎదుట ఉన్నది ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే మొహానే చెప్పేస్తాడు. ఎప్పుడు కూల్ గా ఓర్పుతో సహనంతో ఆట ఆడుతూ టాప్ 5 లో నిలిచిన మానస్ అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ధింకింగ్. చాలా షార్ప్ గా ఆలోచిస్తాడు.

ఇక హౌస్ నుండి బయటకి వచ్చాక..పలు ఇంటర్వ్యుల్లలో బిజీగా ఉన్న మానస్..రీసెంట్  ఇంటర్వ్యుల్లో తన తోటి కంటెస్టేంట్ పింకీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మానస్ మాట్లాడుతూ.."బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 90రోజులు నాతో జర్నీ చేసిన ప్రియాంక  బయటికి వెళ్లాక ఓ ఫుటేజ్‌ చూసి..వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగ్ సార్ ముందు మానస్ నువ్వు నాతో నటించావా లేదా నన్ను భరించావా అని డైరెక్ట అడిగేసింది. బిగ్ బాస్ హౌస్‌లో 24 గంటలు  నన్ను గమనించిన పింకీ కేవలం బయటకు వెళ్ళాక ఒక గంట ఫుటేజ్‌ మాత్రమే చూసి నన్ను అలా అడిగింది అంటే.. అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను" అంటూ మానస్ పింకి మ్యాటర్ లో క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: