ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమా అంటేనే అందులో ఏదో ఒక సందేశం త‌ప్ప‌కుండా ఉంటుంది. అందుకోస‌మేనేమో ఆయ‌న ప్ర‌త్యేకంగా సినిమా క‌థ‌ల‌ను రూపొందించుకుని సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటారు. హీరో సుధీర్‌బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా  ఆ అమ్మాయి గురించి మీకు  చెప్పాలి. సుధీర్‌బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబోలో మూడో చిత్రంగా ఇది వ‌స్తుంది.  

ఈ చిత్రంలో సుధీర్‌బాబు స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది.బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్ మీద గాజుల ప‌ల్లె సుధీర్‌బాబు స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని బి.మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రానికీ నిర్మాత భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మీడియాతో మాట్లాడారు.

అమ్మాయి గురించి చెప్పాలి సినిమా నాకు ప‌ర్స‌న‌ల్ గా చాలా అదృష్ట‌మైన మూవీ అని, అందుకే ప్ర‌తీ సినిమాకు కొత్త‌గా క‌థ చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాను అని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో వ‌చ్చిన రొమాంటిక్ డ్రామా సినిమానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో ఫ్యామిలీ ఎమోష‌న్లు ఉన్నాయి. క‌థ‌లోనే స‌హ‌జ‌మైన కామెడీ ఉంటుంది. సుధీర్‌బాబుతో నాకు ఇది మూడ‌వ సినిమా. మా ఇద్ద‌రి మ‌ధ్య అలా వేవ్ లెంగ్త్ కుదిరింద‌ని చెప్పారు. సుధీర్ బాబు చాలా ప్ర‌తిభ గ‌ల హీరో అని, అతినిలో ఉన్న న‌టుడిని, ఇండ‌స్ట్రీ ఇంకా ఉప‌యోగించుకోవ‌చ్చు. కృతిశెట్టి ఉప్పెన‌లో చూసిన‌ప్పుడు ఇంప్రెసివ్‌లో అనిపించింది.

 శ్యామ్‌సింగ‌రాయ్‌లో కృతి ఆకట్టుకున్న‌ది. కృతిశెట్టి బ‌యోపిక్ కాదు అని, ఆమెను కొత్త‌గా చూస్తారు. ముఖ్యంగా సుధీర్‌బాబు, కృతిశెట్టిలు వాళ్ల న‌ట‌న‌తో ఈ సినిమాలో జీవించారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుంది.. అనూహ్యంగా వీళ్లు ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ ప్రేమ‌కు ఫ్యామిలీ, సొసైటీ నుండి ఎలాంటి ఇబ్బందులు క‌లిగాయి. వాటిని అధిగ‌మించి ఎలా ప్రేమ‌తో పాటు వాళ్లు అనుకున్న‌ది సాధించారనేది స్థూలంగా ఈ చిత్ర క‌థ‌. మైత్రీమూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద సంస్థ మా సినిమాకు ప్రెజెంట‌ర్ గా ఉండ‌డం అనేది సినిమా బాగుంద‌నే స్టాంప్ వేసిన‌ట్టే. మైత్రీ వాళ్ల‌కు థాంక్స్‌. అదేవిధంగా బెంచ్ మార్క్ సంస్థ‌కు శుభారంభం ఇచ్చామ‌నే అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.



మరింత సమాచారం తెలుసుకోండి: