ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి, అందులోని పాటలకు హీరో హీరోయిన్ లు తమ వంతు ప్రయత్నంగా ఎంతో కష్టపడి డాన్స్ మూమెంట్ లు చేస్తూ ఉంటారు, కానీ అందులోని కొన్ని డాన్స్ మూమెంట్స్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి, అలాగే ఈ సంవత్సరం కూడా కొంతమంది హీరోలు వేసిన సిగ్నిచర్ మూమెంట్ స్టెప్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  అలా ఈ సంవత్సరం జనాలను ఆకట్టుకునే సిగ్నేచర్ మూమెంట్స్ చేసిన హీరోలు ఎవరు..? అది ఏ సినిమా లోనిది..? అది ఏ సాంగ్..? అనేది తెలుసుకుందాం...

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా నటించగా అజయ్ దేవగన్ సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన నాటు నాటు అనే సాంగ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి వేసిన సిగ్నిచర్ మూమెంట్ స్టెప్ లు పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాయి, ఈ స్టెప్ లను సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో కూడా వేసాడు.నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు,  ఈ సినిమాలో జై బాలయ్య అనే సాంగ్ కు బాలకృష్ణ వేసిన ఒక సిగ్నిచర్ మూమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది,  అలాగే ఈ స్టెప్ ను రవితేజ లాంటి సెలబ్రిటీ కూడా కూడా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: