ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జ‌రిగిందే ...

అని పాడుకోవ‌డం మిన‌హా ఈ సంక్రాంతికి మ‌నం అనుకున్నంత మ‌నం ఊహించినంత‌గా ఏ విశేషం లేనేలేద‌ని తేలిపోయింది. వస్తుంది..వ‌స్తుంది అని అనుకున్న ఆర్ఆర్ఆర్ రాకుండాపోయింది.ఈ వారం ట్రోలింగ్ టాపిక్ అయిందే త‌ప్ప ప్రేక్ష‌కుడికి మాత్రం ఎటువంటి ఆనందం మిగ‌ల‌కుండానే పోయింది. ఇప్పుడీ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారే అనుకుందాం అప్పుడు స‌మ్మ‌ర్ సినిమాల క‌థేంటి? ఒక్క‌సినిమా కార‌ణంగా సంక్రాంతి సీజ‌న్ మొత్తం పోగొట్టుకున్న నిర్మాత గ‌తేం కావాలి..ఇవే ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను వేధిస్తున్న స‌మ‌స్య‌లు..ఇప్ప‌టికైనా రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ విష‌య‌మై ఏదో ఒక‌టి తేల్చేస్తే బాగుంటుంది అన్న‌ది స‌గ‌టు సినిమా అభిమాని అభిప్రాయం..ఈ నేప‌థ్యంలో పెద్ద పండుగ‌కు పెద్ద సినిమాలు అన్నీ సైడ్ అయిపోయి అస‌లు ఎప్పుడు తీశారో తెలియ‌ని సినిమాలు కూడా థియేట‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌ట్ట‌డం విశేషం. పోనీలేండి చిన్న సినిమా ఇలా అయినా బ‌తికి బ‌య‌ట‌ప‌డితే అదే సంతోషం అని ఈ వారాంతంలో స‌ర్దుకుపోదాం. ఇలాంటి విప‌త్క‌ర ధోర‌ణిలో, అనూహ్య‌త నేప‌థ్యంలో ట్రోలింగ్ టాపిక్ కూడా భ‌లే సందడి చేస్తుంది. మెమే క్రియేట‌ర్స్ (meme creators) తాజా ప‌రిణామాల‌తో ఈ వారం పండుగ చేసుకోవ‌డం ఓ విశేషం. వివ‌రాల్లోకి వెళ్తే...
నిజానికి సంక్రాంతి అంటే ఇంటి నిండా ఆనందం,చక్కని పిండి వంటలు, ఇంటిల్లిపాది సంతోషంతో జరుపుకునే సంక్రాంతి పండుగ లో సినిమాలు కూడా ముఖ్య భాగం పోషిస్తాయి. ఇక ప్రతి ఏడాది మాదిరిగా వాస్తవానికి ఈ సంక్రాంతి సమయానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ చరణ్ ల భారీ మూవీ ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.అయితే ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం వలన మహేష్, పవన్ ల సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల విజృంభణతో కొన్ని రాష్ట్రాల్లోని థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించడంతో ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేస్తున్నట్లు యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటించింది.


మరోవైపు కేవలం జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నప్పటికీ అది కూడా పక్కాగా వస్తుందా లేదా అనే అనుమా నం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఆర్ఆర్ ఆర్ పొంగల్ రేస్ నుండి తప్పుకుందో అప్పటి నుండి పలు చిన్న సినిమాలు ఆ సమయంలో రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. వాటిలో గల్లా అశోక్ నటిస్తున్న హీరో, ఆది సాయి కుమార్ అతిథి దేవోభవ, డీజే టిల్లు, 6 డేస్ 7 నైట్స్, రౌడీ బాయ్స్, వంటి సినిమాలు ఈ రేస్ లో ఉన్నాయి. దీనితో ఒక్కసారి గా ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న ఈ చిన్న సినిమాలపై తమదైన రీతిలో సోషల్ మీడియాలో ట్రోల‌ర్స్ సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: