గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ల వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సినిమా ఇండస్ట్రీ తరఫునుంచి చాలామంది సెలబ్రిటీలు ఏపీ ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. టికెట్ రేట్ల విషయంలో తగ్గేది లేదంటూ ప్రభుత్వం తన వైఖరిని కొనసాగిస్తోంది. ఇక తాజాగా తన సినిమా పెద్దగా ఉండబోనని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయగా, మరోవైపు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంపై లేఖ రాస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ టికెట్ రేట్ల విషయమై స్పందించారు. ' ఆశ ' సినిమా ప్రమోషన్లలో ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడని వర్మ ఇప్పుడు మాత్రం దానిపై పూర్తిగా స్టడీ చేసి ఏపీ ప్రభుత్వానికి వరుసగా ప్రశ్నలు సంధించిన స్పందించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ముందుగా ఈ వివాదం గురించి తనకు పెద్దగా తెలియదని తప్పించుకున్న వర్మ ఇప్పుడేమో ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను సైతం తన మాటల్లో ప్రస్తావిస్తూ కౌంటర్ వేశారు.

ఆర్జీవి ఏపీలో సినిమా టికెట్ల రేట్లు విషయంపై మాట్లాడుతూ... ఎక్కడో ఒకచోట ఎవడో ఒకడు 50 రూపాయలకు ఇడ్లీ అమ్ముకుంటాడు. వాడి పక్కనే మరొక హోటల్ పెట్టి తన స్టైల్ వేరు అంటూ అదే ఇడ్లీ ని 500 రూపాయలకు అమ్ముతాడు. అయితే 500 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలా? లేదా 50 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలా అనేది తినే వాడి ఇష్టం. ఒకవేళ వాడికి స్థోమత లేకపోతే కొనుక్కోడు. అంతే కానీ ఖచ్చితంగా కొనాల్సిందే అని చెప్పి ఎవరూ గన్ పెట్టి బెదిరించరు. అలాగే సినిమా హీరోలకు 70శాతం, మేకింగ్ కు 30 శాతం ఖర్చు అవుతుందని పేర్ని నాని, అనిల్ లాంటి వాళ్లు అంటున్నారు. కానీ అది ఫండమెంటల్ గా రాంగ్. అసలు మేకింగ్ కాస్ట్ అంటే ఏమిటి ? హీరోలు డబ్బులు ఇవ్వడం కూడా మేకింగ్ కాస్ట్ కిందకే వస్తుంది ?


హీరోని చూసే ప్రేక్షకులు థియేటర్ లోకి వస్తారు. నిత్యావసర వస్తువులు అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ నిత్యవసర వస్తువులలోకి వస్తుందా? అలాగే ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా బయట ఉన్నట్టుగానే ధరలు ఉండాలి. అలాగే ఒక నార్మల్ షర్ట్ కి, బ్రాండ్ షర్ట్ కి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగే ధరలు ఉండాలి. మరి అలా ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు. ప్రొడక్ట్ క్రియేట్ చేసిన వారికి దాన్ని ధరను నిర్ణయించే హక్కు ఉంటుందని అన్నారు. అలాగే అసలు ఎంఆర్పి అనేది ఎందుకు ఉంటుందో కూడా వివరించారు. ఇంకా వర్మ ఏమన్నాడో ఈ వీడియోలో వివరంగా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: