అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన శివ మనసులో శృతి ( ఎస్ ఎం ఎస్) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకోవడం తో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో రేజీనా కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది, అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన రెజీనా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ హాట్ బ్యూటీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే విడుదలైన తలైవి సినిమాలో ఒక పాత్రలో నటించింది. ఇలా సినిమాల్లో హీరోయిన్ పాత్రల కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉండకుండా ఏ పాత్ర వచ్చినా కూడా చేస్తూ వెళ్తున్న రేజీనా తాజాగా ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతోంది.

  అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో రెజీనా అలరించబోతోంది, ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమో ను కూడా చిత్ర బృందం విడుదల కూడా చేసింది, ఈ ప్రోమో లో రెజీనా తన అందచందాలతో, అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది, ఈ పాట పూర్తి లిరికల్ వీడియో సాంగ్ జనవరి 3 వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదల కానుంది. చిన్న ప్రోమో సాంగ్ తోనే ఈ రేంజ్ లో అదరగొట్టిన రెజీనా మరి ఫుల్ సాంగ్ తో ఏ రేంజ్ లో అదరగొడుతుందో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, మరి చిరంజీవి రెండో ఇన్నింగ్సులో ఇప్పటికే ఖైదీ 150 లో లక్ష్మీరాయ్ తో ఆడిపాడిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో  రేజీనా తో చిందులేయనున్నడు.

మరింత సమాచారం తెలుసుకోండి: