బాలయ్య బాబు, బోయపాటి హ్యాట్రిక్ కాంబోగా వచ్చిన అఖండ సినిమా నెల రోజులు అవుతున్నా ఇంకా వసూళ్లతో అదరగొడుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజై నెల రోజులు అవుతుండగా ఇప్పటికీ కొన్ని చోట్ల హౌజ్ ఫుల్ షోస్ నడుస్తున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ వీకెండ్ లో బాలయ్య అఖండ ఆంధ్రాలో చాలా చోట్ల ఫస్ట్ షో హౌజ్ ఫుల్ అయ్యాయి.

అంతేకాదు మహేష్ ఏ.ఎం.బి సినిమాస్ లో కూడా అఖండ సినిమాకు స్పెషల్ షో ఏర్పాటు చేశారు. బాలయ్య నట విశ్వరూపం నందమూరి ఫ్యాన్స్ కే కాదు మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా బీభత్సంగా నచ్చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరియర్ లో 101 కోట్ల హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సాధించింది అఖండ. అంతేకాదు అఖండ సినిమా నైజాం లో బాలకృష్ణ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సినిమా నైజాం లో 20 కోట్ల దాకా షేర్ రాబట్టి బాలయ్య సత్తా చాటింది.

సినిమాలో బాలయ్య అహోర పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అఖండ వసూళ్ల హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. 32వ రోజు కూడా వసూళ్లు అదరగొడుతుంది. చూస్తుంటే ఫుల్ రన్ లో బాలయ్య కెరియర్ బెస్ట్ హిట్ గా అఖండ నిలిచేలా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేఏసుకున్నాడు. జై బాలయ్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఆడియెన్స్ కు మరోసారి మాస్ జాతర అందిస్తుందని అంటున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఆడియెన్స్ కి మాంచి కిక్ ఎక్కిస్తుందని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: