10 ఏళ్ల క్రింద టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే.. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందని లెక్కలేసుకునేవారు. ఆ సినిమా యాభై రోజులు.. వంద రోజులు.. రెండు వందల రోజులు ఏఏ థియేటర్లలో ఆడిందని లెక్కలేసుకునేవారు. అలా తమ సినిమా రికార్డు సృష్టించిందని గొప్పగా చెప్పుకొచ్చేవారు. కానీ ప్రస్తుత విధానం మారింది. ప్రస్తుతం ఫాలొవర్స్, కామెంట్స్, హ్యాష్ ట్యాగ్స్ ద్వారానే ట్రెండింగ్ నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ హీరోకి ఎంత మంది ఎక్కువ ఫాలొవర్స్ ఉంటే వారి గురించి మాట్లాడుకుంటారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఏ హీరోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా రీచ్ అవుతున్నాయి. వేటికి ఎక్కువగా ట్విట్స్ వస్తున్నాయనే విషయంపై నెటిజన్లు, అభిమానులు చర్చించుకుంటుంటారు. అలా తమ అభిమాన హీరోలను ట్రెండింగ్ చేయడానికి నానా అవస్థలు పడుతుంటారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచినప్పుడు.. తమ హీరో రికార్డు సృష్టించాడని గొప్పగా చెప్పుకుంటారు. తాజాగా మహేశ్ బాబు అభిమానులు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఇండియన్ స్టార్ హీరోకు దక్కని గుర్తింపు లభించింది. ఇండియన్ సినిమా సెలబ్రెటీలకు దొరకని అరుదైన రికార్డు మహేశ్ బాబు దక్కించుకున్నట్లు సమాచారం.



అయితే, మహేశ్ బాబుకు దక్కిన ఆ రికార్డు ఏంటో తెలుసా..? మహేశ్ బాబు ట్విట్టర్‌లో ట్విట్ చేసిన 30 ట్విట్లకి లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంట. ఇతర సెలబ్రిటీలకు ఆ స్థాయిలో లైక్స్ రాలేదని, వారికి కేవలం వేలల్లో లైక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మహేశ్ బాబుకు మాత్రమే లక్షకు పైగా లైక్స్ ఉన్నాయి. దీంతో మహేశ్ బాబు ఆల్ ఇండియా రికార్డును దక్కించుకున్నాడు. ఈ రికార్డుతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు ఈ సక్సెస్ దక్కిందని పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ బడా హీరోల వల్ల కాని రికార్డును మహేశ్ బాబుకు ఈజీగా రికార్డు సృష్టించారని అభిమానులు కాలర్ ఎగరవేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: