‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడటంతో అయోమయంలో ఫిలిం ఇండస్ట్రీ పడిపోయింది. జనవరి 7న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అవుతోందని తెలిసి చాల సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను మార్చుకున్నాయి. ఆఖరికి ‘భీమ్లా నాయక్’ ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్కచేయకుండా విడుదల కావడానికి ప్రయత్నాలు సాగిస్తే తీవ్ర ఒత్తిడి చేసి ఆమూవీని వెనక్కు పంపారు.



ఇక ‘రాధే శ్యామ్’ విషయంలో కూడ ఆమూవీ కంటే ఎక్కువ ధియేటర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ కు వచ్చే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విపరీతమైన ప్రచారం మొదలుపెట్టి మరొక సినిమాను తమ వైపు చూడకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసారు. చివరకు ఆఖరి నిముషంలో కొనసాగుతున్న పరిస్థితులు వల్ల తమ సినిమా విడుదల కావడం లేదు అంటూ చిన్న ప్రకటన సోషల్ మీడియాలో ఇచ్చి తమ మూవీ రిలీజ్ డేట్ ను తరవాత ప్రకటిస్తాము అంటూ తప్పుకున్నారు.





ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా ఒమైక్రాన్ కేసుల హడావిడి మరొక రెండు నెలలు కొనసాగి మార్చి నెలాఖరుకు మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సమ్మర్ రేస్ కు సంబంధించి అనేక భారీ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించాయి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అంటూ మళ్ళీ రంగంలోకి దిగితే ఇంకా ఎన్ని సినిమాలు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం త్యాగాలు చేయాలి అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.



దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ను గతంలో సల్మాన్ ఖాన్ ‘రాధే’ విషయంలో అనుసరించినట్లుగా డైరెక్ట్ గా ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేస్తే బాగుంటుంది కదా అన్నఅభిప్రాయాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామందికి ఉన్నాయి. అయితే ఈ అభిప్రాయాన్ని డైరెక్ట్ గా రాజమౌళికి చెప్పే సాహసం చాలామంది చేయలేకపోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ సమ్మర్ రేస్ లోకి అడుగు పెడితే ఈసమ్మర్ సీజన్ ను నమ్ముకుని ఉన్న అనేక భారీ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ సంక్రాంతి సీజన్ మిస్ అయినందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు తెగమధన పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: