టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్ లతో మొదటి రెండు సినిమాలు చేసినా సరే వర్క్ అవుట్ కాలేదు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకి మొదటి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తుంది నిధి అగర్వాల్.

ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కోసం హాట్ షో చేస్తుంది నిధి అగర్వాల్. సినిమాలు చేస్తున్నా తన ఇన్ స్టా గ్రాం లో రెచ్చిపోతుంది. అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమె ఫాలోవర్స్ కు ఫుల్ జోష్ ఇస్తుంది. లేటెస్ట్ గా నిధి అగర్వాల్ హాట్ పిక్స్ షేర్ చేసింది. థై షో చేస్తూ క్యూట్ లుక్స్ తో చలికాలం వేడి పుట్టిస్తుంది నిధి అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న అమ్మడికి తమిళ తంబీలు గుడి కూడా కట్టేశారు.

తెలుగులో పవర్ స్టార్ తో పాటు అవకాశం అందుకున్న అమ్మడు ఖచ్చితంగా ఆ సినిమా తర్వాత తన రేంజ్ పెంచుకుంటుందని చెప్పొచ్చు. సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అమ్మడు చేస్తున్న స్కిన్ షో అదిరిపోతుంది. తన గ్లామర్ లుక్ తో నిధి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అమ్మడు రెండు క్రేజీ ప్రాజెక్టులు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. చూస్తుంటే నిధి రానున్న రోజుల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. హీరో సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా హరి హర వీరమల్లు సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: