యంగ్ హీరో రౌడీ విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. వచ్చిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి.. ఇప్పుడు మరో సినిమా లో నటిస్తూన్నారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా లైగర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమా లో రౌడీ లుక్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా ఎప్పుడూ విడుదల అవుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు పూరి అండ్ టీం. చిత్రప్రమోషన్స్‏లో భాగంగా లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో.. విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త లుక్‏లో చూపించి ఫ్యాన్స్‏ను ఖుషి చేశారు డైరెక్టర్.ఆ రోజున విడుదలైన లైగర్ గ్లింప్స్ యూట్యూబ్‏లో రికార్డ్స్ ను షేక్ చేస్తుంది.


అలా రిలీజ్ అయ్యిందో లేదో..గంటల వ్యవధిలోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకున్న లైగర్ గ్లింప్స్.. తాజాగా 25 మిలియన్‏కు వ్యూస్ మైలురాయిని చేరింది. 5.5 లక్షల లైక్స్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాప్‏లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది.. సోషల్ మీడియాలో కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. కండలు తిరిగిన వీరుడు లాగా హీరో కనిపిస్తాడు.మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‏తో లైగర్ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో బాక్సర్‏గా కనిపించనున్నాడు విజయ్.. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంధి. ఈ కథ నిజ జీవితంలో జరిగిన సంఘటన ల ఆధారంగా ఈ సినిమా కథ ఉండనుంధి.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: