తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే.. మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. కానీ కాలం కలిసిరాలేదని చెప్పవచ్చు. అందుకు కారణం ఆమె కాస్త బొద్దుగా ఉండటమే అన్నట్లుగా సమాచారం. ఆమె సన్నబడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి.. ప్రస్తుతం ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే  హీరోయిన్ నుంచి ప్రస్తుతం ఉన్న హీరోయిన్ ల వరకు సన్నబడడం కోసం ప్రతి ఒక్కరు చాలా ట్రై చేస్తూనే ఉంటారు. తాజాగా కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు ఆమెను చూసి ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.. ఎంతో బొద్దుగా ఉండే రాశిఖన్నా ఒక్కసారిగా సన్నబడడం తో ఆశ్చర్యపోయారు. అయితే ఇలా కావడం కోసం ఆమె ఆపరేషన్ చేయించుకుంది అనే వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఈ విషయం రాశీఖన్నా కు ఎదురవడంతో ఆమె స్వయంగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది.
సమయం దొరికినప్పుడు తన సినిమాలను తానే చూసుకున్నప్పుడు.. ఉన్న దాని కంటే అధిక బరువు ఉన్నట్లుగా తనకు కనిపించడం తో పాటుగా.. ఏదైనా సినిమా రివ్యూ చూసేటప్పుడు.. అందులో కూడా ఈమె లావుగా ఉన్నదని కామెంట్ రూపంలో నెటిజన్లు తెలియజేయడంతో ఫిట్ నెస్ పైనే దృష్టి పెట్టానని తెలియజేసింది. ఇక అప్పట్నుంచి డైట్ కంట్రోల్ ని మొదలు పెట్టిందట. ప్రతిరోజు జిమ్ కు వెళుతూ కఠినమైన ఎక్సర్సైజులు చేస్తూ.. తన ట్రైనర్ చెప్పిన విధంగా పద్ధతులను పాటించడం వంటివి చేసేదట. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. రాశిఖన్నా ఇంతలా కష్టపడి సన్నబడిందా అంటూ కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: