మేఘా ఆకాశ్‌ ఈ అమ్మడు పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం అయిన కూడా తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది . తొలి సినిమాలోనే మంచి నటనను కనబరిచిన ఈ చిన్నది వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంటుంది 

నితిన్ నటించిన లై అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ మేఘ ఆకాష్. లై సినిమా తర్వాత వెంటనే నితిన్‌తో మరో సినిమాbకూడా చేసింది. చల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

 ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ చిన్నది తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసిందని తెలుస్తుంది.. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుందని సమాచారం.

ఇటీవల శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోర అనే సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది ఈ చిన్నది. ఇందులో మేఘా ఆకాశ్‌కి మంచి మార్కులే పడ్డాయి కూడా.మేఘా ఆకాశ్ నటనటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక డియర్ మేఘ అనే సినిమాతోను ఈ అమ్మడు ఎంతగానో సందడి చేసింది.

మేఘా ఆకాశ్ నటించిన సినిమాలు పూర్తి స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మేఘా ఆకాశ్ ముందుకు సాగిపోతుంది. దాంతో ఇప్పుడామె చేతిలో ఏకంగా మూడు నుండి నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శివ కందుకూరితో నటిస్తున్న 'మను చరిత్ర' ఒకటి.

అలానే సత్యదేవ్ మరియు తమన్నా నటిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' మూవీలోనూ మేఘా ఆకాశ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇక బైలింగ్వల్ మూవీ అయిన 'అక్టోబర్ 31 లేడీస్ నైట్'లోనూ మేఘా ఆకాశ్ నటిస్తోందట.'మను చరిత్ర' సినిమాలోని 'ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా' అనే పాటను కాజల్ విడుదల చేయగా ఆ పాట అందరిని అలరిస్తుంది.

సోషల్ మీడియాలోను ఈ అమ్మడు బాగా సందడి చేస్తుంటుంది. క్యూట్ లుక్స్‌తో స్మైల్ ఇస్తూ అందరి మనసులు కొల్లగొట్టేలా ఆమె చిన్నప్పటి పిక్ ఒకటి బాగా హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో ఎవరిదబ్బా ఇంత క్యూట్ గా ఉంది అని నెటిజెన్స్ తెగ వెతుకుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: