సింగర్ సునీత అందరికి సుపరిచితురాలె.. ఎన్నో వేల పాటలను, ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది. తెలుగు తో పాటుగా పలు ఇండస్ట్రీ లో కూడా పాటలు పాడి అందరి మనసును చూరగొంది.ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే నెట్టింట్లో తన గాత్రంతో పాటలు పాడుతూ.. లైవ్ వీడియోస్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సునీత..


ఇటీవల తను వ్యాపార వేత్త రామ్ ను వివాహం చేసుకున్నారు.. తనకు, తన బిడ్డలకు అవసరం. ఉండటం వల్ల ఈ వివాహం చేసుకున్నాని చెప్పారు. కానీ తన మాటను ఎవరూ లెక్క చేయలేదు. ఈ వయస్సులో రెండో పెళ్ళి అవసరమా అంటూ నోటికి వచ్చినట్లు అన్నారు. కొన్ని విషయాలు భాధను కలిగించాయి.. అవి సునీత లెక్క చేయలేదు.. ఇప్పుడు తానూ సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది..


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు సునీత కొత్త పద్దథులను అలవాటు చెసుకుందని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. తనకు వ్యవసాయం చేయడమంటే ఇష్టమంటూ అరటి తోట లో, కూరగాయల తోటలో పనిచేస్తున్న వీడియోస్ పోస్ట్ చేసింది. వీటికి జాయ్ ఆఫ్ ఫార్మింగ్… నాకు సంగీతం ఇష్టం. నా కుటుంబం, స్నేహితులను నేను ప్రేమిస్తున్నాను. నేను నన్ను ఇష్టపడేవారిని ప్రేమిస్తున్నాను. నాకు వ్యవసాయం, తోటపని అంటే చాలా ఇష్టం.. అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది.. అది నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో ను చూసిన వారంతా సునీత ఎందుకు ఇలా కొత్తగా ఆలొచిస్తుంది అంటూ కామెంట్ల తో రచ్చ చేస్తున్నారు. సునీత పోస్ట్ చేసిన ఆ వీడియోలను మీరు ఒకసారి చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి: