పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి దాదాపు మూడు సంవత్సరాల విరామం తరువాత వకీల్ సాబ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తరువాత పలు సినిమాలకు ఓకే చెప్పి వాటిని చిత్రీకరిస్తున్నారు. అయితే కేవలం ఒక నెల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.. పవన్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అదేంటంటే.. తమ్మారెడ్డికి తాజాగా ఒక ప్రశ్న ఎదురైంది అదేంటో చూద్దామా.  ఏపీలో జగన్ పరిపాలన బాగుంటేనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తానని అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఆదాయం కోసం వచ్చారా? లేక జగన్ పాలన బాగుండటం వల్ల వచ్చారా అనే సందేహం తలెత్తింది. తాజగా ఈ విషయంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి ఉంటే ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవచ్చునని అన్నారు.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… అందువల్ల జగన్ పరిపాలన బాగున్నట్టేగా అనుకోవాలని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ నడవాలంటే ఈ ఐదు సినిమాలు చేస్తే 300 కోట్ల రూపాయలు వస్తుంది వీటితోనే నడుస్తుందా..? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పార్టీ నడవాలంటే సినిమాలు చేయడం కరెక్ట్ కాదని తమ్మారెడ్డి అన్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని సంపాదించిన డబ్బునంతా పార్టీ పెడతారు.. కానీ ఆ డబ్బు ఏమాత్రం సరిపోదు అని తమ్మారెడ్డి తెలిపారు.

ఇక ఒకే పద్ధతిలో వెళ్తే పవన్ కళ్యాణ్ కు డబ్బు అవసరం లేదని.. ఆయన రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటే చేస్తారని.. కేవలం పవన్ మాట మీద ఉంటే ఏమైనా చేయగలరని తమ్మారెడ్డి అన్నారు. అంతేకాదు..  పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషిలా అయిపోయారని.. అలా ఉండడం వల్లే ప్రజలు పవన్ ని నమ్మలేకపోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: