దాదాపు మూడేళ్లు వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని `కందిరీగ` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని మాంచి కంబ్యాక్ ఇచ్చాడు. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో హన్సికా మోట్వాని, అక్షా పార్ధసాని హీరోయిన్లుగా న‌టించ‌గా..సోనూ సూద్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి ప్ర‌స్తుత స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రైటర్ గా ప‌ని చేశారు. 2011 ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని నిర్మాత‌ల‌కు భారీ లాభాల‌ను తెచ్చి పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 9 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఏకంగా 21 కోట్ల వరకు షేర్ ని సొంతం చేసుకుని బిగ్ హిట్‌గా నిలిచింది. తమన్ అందించిన మాస్ సాంగ్స్ సినిమాకు మ‌రింత హైలైట్‌గా నిలిచాయి.

 ఇక ఈ సినిమాతో ఇటు రామ్‌, అటు డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీ‌నివాస్ సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకున్నారు. అయితే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ముందు ఎన్నో అవంతరాల‌ను ఎదుర్కొంది. రెండేళ్లు ఈ చిత్రం స్టార్ హీరోల చుట్టూ తిరిగింది. నిజానికి ఈ సినిమాను మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌తో తీయాల‌ని సంతోష్ శ్రీ‌నివాస్ అనుకున్నారు. క‌థ కూడా వినిపించ‌గా.. ఆయ‌న నో చెప్పారు.

ఆ త‌ర్వాత ఈ సినిమా క‌థ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌న సైతం రిజెక్ట్ చేశారు. దాంతో అనిల్ రావిపూడి, సంతోష్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి అనేక సార్లు కథనంలో మార్పులు, చేర్పులు చేసి చివ‌ర‌కు రామ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అప్ప‌టికే మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ వంటి ఫ్లాప్స్‌ను మూట గ‌ట్టుకున్న రామ్‌.. మొద‌ట్లో కాస్త భ‌య‌ప‌డినా సంతోష్ శ్రీ‌నివాస్‌పై న‌మ్మ‌కం పెట్టుకుని కందిరీగ‌కు ఒకే చెప్పాడు. ఇక రామ్ న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌కుండా సంతోష్ భారీ హిట్‌ను అందించి ఆయ‌న‌ కెరీర్‌ను మ‌ళ్లీ పైకి లేపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: