కొంతమంది హీరోలకు ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు లభిస్తాయి, ఆ సినిమాలతో వారు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, అయితే ఆ తర్వాత మాత్రం వారు నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్  కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోతుంటారు. అయితే అలా డీలా పడిపోయిన సమయంలో ఏదో ఒక సినిమా ద్వారా మళ్లీ ఫామ్ లోకి వస్తారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా తోనే విజయం అందుకని ఆ తర్వాత వరుస అపజయాలను అందుకని తిరిగి ఫామ్ లోకి వచ్చిన హీరో నితిన్. మొదటి సినిమా జయం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తర్వాత కొంత కాలం మాత్రం వరుస పరాజయాలను చవి చూశాడు. ఆ తర్వాత ఈ హీరో ఇష్క్  సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించింది.


నితిన్ కెరియర్ లో వరస ఫ్లాపులు ఉండడంతో ఈ సినిమా విడుదలకు ముందు జనాల్లో పెద్దగా ఎలాంటి అంచనాలు లేవు. అలా  ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ సినిమా 24 ఫిబ్రవరి 2012 న విడుదల అయింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే .. అనుకోకుండా కలిసిన నిత్య మీనన్, నితిన్ ప్రేమించుకుంటారు. కానీ వీరిద్దరూ ప్రేమించుకోవడం నిత్యా మీనన్ అన్నయ్య అజయ్ కి నచ్చదు. అయితే అజయ్ వీరిద్దరిని విడగొట్టడానికి ఏమేమి ప్రయత్నాలు చేశాడు, చివరిగా విడగొట్టాడా లేదా అనేదే ఈ సినిమా కథ . ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: