విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా ఆయన కెరీర్ ను మరో లెవెల్ తీసుకు వెళ్ళింది అని చెప్పవచ్చు. అప్పటి దాకా తెలుగులో విక్రమ్ గురించి పెద్దగా తెలియదు. ఆయన నటించిన కొన్ని సినిమాలు మాత్రమే తెలుగులోకి రాగా ఓ తమిళ హీరో సినిమా వచ్చింది అని అనుకునే వారే తప్పా ఆయన కు సెపరేట్ ఇమేజ్ అంటూ వచ్చింది మాత్రం ఈ సినిమా తోనే అని చెప్పొచ్చు.  అలాంటిది శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన ఈ అపరిచితుడు సినిమా తెలుగులో విడుదలైన తర్వాత ఆయనకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.

విక్రమ్ అసమాన్యమైన నటనకు ప్రేక్షకుల ఆదరణ తోడై ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించడంతో పాటు యూనిట్ కి కూడా మంచి పేరొచ్చింది. ఆవిధంగా 2005 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి చిత్ర యూనిట్ కి మంచి పేరును తీసుకు వచ్చింది. ఈ చిత్రం యొక్కంకతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అయిందని చెప్పవచ్చు.  సమాజంలో గౌరవ మర్యాదలతో కుటుంబం తో బ్రతికే ఓ బ్రాహ్మణ యువకుడు తనచుట్టూ ఉండే సమాజం పట్ల జరిగే అన్యాయాల వల్ల ఒత్తిడి కి గురై మల్టిపుల్ పర్సనాలిటీ కి గురవుతాడు.  

అలా అపరిచితుడు గా మారి లంచగొండులను చంపుతూ ఉండే ఈ హీరో పాత్రను దర్శకుడు శంకర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. అంతేకాదు మూడు షేడ్స్ ఉన్న పాత్రలో విక్రమ్ కూడా అదే గొప్ప రేంజ్లో నటించి ఈ సినిమా పట్ల అందరిలో మంచి ఇంట్రెస్ట్ కలిగించేలా చేశాడు. లవర్ బాయ్ రెమో పాత్ర అయితే ఈ సినిమా కే హైలైట్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాలుగింతల ప్రాఫిట్ పొందింది అంటే అప్పట్లో ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎంతగా ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. శంకర్ మరొకసారి తన మ్యాజిక్ ని చూపించి ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: